sonu sood tractor facts
సోనూసూద్.. ఈ కరోనా కాలంలో ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకుంటూ నిజమైన హీరో అనిపించుకుంటోన్న నటుడు. మొన్నటి వరకూ సినిమాల్లో విలన్ వేషాలే వేసిన సోసూసూద్.. కరోనా విపత్తులో చేసిన సహాయ కార్యక్రమాలతో రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి లక్షలమందికి ఆసరాగా నిలిచాడు. నడిచి వెళుతున్న కార్మికులను బస్సుల్లో వారి సొంత ఊళ్లకు పంపించడం నుంచి ముంబైలో రోజూ వేలాదిమందికి ఫుడ్ సప్లై చేస్తూ.. ఇండియాస్ సూపర్ హీరో అనిపించుకున్న సోనూసూద్ తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో నాగేశ్వరరావు అనే ఓ రైతు తన ఇద్దరు కూతుళ్లను కాడెద్దులుగా పెట్టి పొలం దున్నుతున్న ఫోటో చూసి చలించిపోయాడు. వెంటనే ఆ రైతుకు రెండు ఎద్దులను ఇస్తానని .. ఆడపిల్లలను చదువులపై దృష్టిపెట్టమని చెప్పి.. తర్వాత ఎద్దులకంటే ట్రాక్టర్ ఇస్తానని చెప్పి.. గంటల వ్యవధిలోనే మాట నిలబెట్టుకున్నాడు. ఇక్కడి వరకూ బానే ఉన్నా.. ఎప్పుడైతే ఈ మేటర్ లోకి రాజకీయాలు ఎంటర్ అయ్యాయో కథ అనేక మలుపులు తిరుగుతోంది. అతను పేద రైతు కాదనీ.. ఆస్తిపరుడే అనీ.. అతను కూతుళ్లతో కలిసి సరదాగా తీసుకున్న ఫోటో అదనీ.. సోనూసూద్ ను మోసం చేశారనీ.. మొదలై.. ఆ రైతు కూడా తన ట్రాక్టర్ ను పంచాయితీకి ఇస్తున్నాడు అంటూ ఏవేవో చెప్పారు. కానీ వాస్తవం వేరు.
ఆ రైతు నిజంగా సంపన్నుడు కాదు. అతని గురించి అసలు నిజాలేంటో చూడండి. నాగేశ్వర రావు గారు షెడ్యూల్ కాస్ట్ కు కులానికి చెందిన వారు..ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నపుడు 1.87 సెంట్లు భూమి ని నాగేశ్వరరావు గారు తండ్రి రామయ్య కి ప్రభుత్వం భూ పంపిణీ చేశారు, ప్రస్తుతం ఆ భూమిని తాము సాగు చేసుకుంటున్న నాగేశ్వరావు గారు చెప్పారుతనకు సొంత ఇల్లు కూడా లేదు అని, రాజకీయాల్లో మార్పుకోసం ఒకసారి లోక్ సత్తా పార్టీ నుంచి పోటీ చేశాడు. అతను ఇప్పుడు జిల్లా పౌర హక్కుల సంఘం కార్యదర్శిగా ఉన్నాడు. తాను ప్రస్తుతం మదనపల్లిలో ఒక టీ అంగడి నడుపుకుంటూ జీవిస్తున్నారని చెప్పారు.. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం తనపై తన కుటుంబం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని నాగేశ్వరరావు గారు వాపోయారు. ఈ విషయంలో ఎవరికి ఎటువంటి సందేహాలు ఉన్నా డైరెక్ట్ గా నన్ను సంప్రదించవచ్చని తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు (94414 07516). అదీ విషయం.. ఇంతకు మించి ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే నేరుగా ఈ నెంబర్ కు ఫోన్ చేయొచ్చు. ఏదేమైనా అతను ఎమ్మెల్యేగా పోటీ చేశాడు అనగానే కోటీశ్వరుడు అని భ్రమించి.. అటు చంద్రబాబు నుంచి ఇటు వైఎస్ఆర్సీపీ వరకూ రకరకాల రాజకీయాలు చేస్తూ ఓ పేదవాడి జీవితంతో ‘ట్రాక్టర్ రాజకీయాలు’ ఆడుతున్నారని చెప్పాలి.