Sonusood arrives Hyderabad
హైదరాబాద్ కు సోనూసూద్ – అపూర్వ స్వాగతం
సినిమాల్లో విలన్ పాత్రల్లో కనిపించిన నటుడు సోనూసూద్ కరోనా కాలంలో వలస కార్మికులతోపాటు, వేలాదిమందికి సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు. తనవంతుగా సాయం చేయడమే కాదు, ఆ సాయం పదిమందికి మేలు చేసేలా తన సేవా కార్యక్రమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే లాక్డౌన్ తర్వాత టాలీవుడ్ లో తెలుగు సినిమాల షూటింగ్ సందడి మొదలైంది. దాంతో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజా మూవీ ‘అల్లుడు అదుర్స్’ మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. సోమవారం హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది.
ఈ సందర్భంగా హైదరాబాద్లో అడుగుపెట్టిన సోనూసూద్ కు అపూర్వ స్వాగతం లభించింది. లోకేషన్ లోకి ఎంటర్ కాగానే యూనిట్ సిబ్బంది అంతా చప్పట్లతో, ఉత్సాహంగా ఆహ్వానించారు. అనంతరం ప్రకాశ్ రాజ్ సోనూకు శాలువా కప్పి సత్కరించారు. ఆయనకు ఓ జ్ఞాపికను కూడా అందించారు. యూనిట్ సభ్యులంతా ఆయన ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.