సోనుసూద్ ‘గ్రీన్ చాలెంజ్’

4
Sonusood participate Green Challenge

Sonusood participate Green Challenge

సోనూ సూద్ ప్రముఖ సినీ దర్శకుడు శ్రీను వైట్ల ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో సోనూ సూద్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్  ముందుకు తీసుకురావడం గొప్ప విషయమన్నారు. కరోనా కాలంలో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత పెరిగింది. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత. లక్షలాది మంది గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని కాపాడాలని సోనుసూద్ అభిమానులను కోరారు.