సూఫీ, సుజాత’.. గ్రేట్ లవ్ స్టోరీ అవుతుందా?

soofi, sujatha love story

కొన్ని కథలు తెలిసినప్పుడో .. ట్రైలర్స్ చూసినప్పుడో వెంటనే ఫిదా అయిపోతాం. ఆ రేంజ్ లో ఉంటాయవి. ఆర్టిస్టులు కూడా కీలకమైన అలాంటి కథలకు ది బెస్ట్ టీమ్ ఉంది అనిపించినప్పుడు భాషలకు అతీతంగా ఆ సినిమాలు చూడాలని ఫిక్స్ అయిపోతాం. అలాంటి భావనను కలిగిస్తూ మళయాలంలో ఓ సినిమా రాబోతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ చూస్తేనే పొయొటిక్ గా ఉంది. ‘సూఫీయుమ్ సూజాతయుమ్’(సూఫీ, సుజాత)అనే టైటిల్ తో రాబోతోన్న ఈ ట్రైలర్ ప్రస్తుతం అమెజాన్ లో హాట్ టాపిక్ అయిపోయింది. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ప్రతి సినిమాతోనూ మెస్మరైజ్ చేస్తోన్న బ్యూటీ అదితిరావు హైదరితో పాటు మళయాల స్టార్ జయసూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘సూఫీయుమ్ సూజాతయుమ్’ట్రైలర్ చూసిన వెంటనే ఆకట్టుకునేలా కనిపిస్తోంది. కంటెంట్ పరంగానూ కొత్తగా కనిపిస్తోంది.

సంప్రదాయ కుటుంబానికి చెందిన సుజాత.. ఓ సూఫీ ప్రేమలో పడటం.. తనకు అంతకు ముందే మరో వ్యక్తితో పెళ్లి కుదిరి ఉండటం అనే పాయింట్ చుట్టూ అల్లుకున్నట్టుగా కనిపిస్తోన్న ఈ మూవీ వెండితెరపై ఓ కవిత్వం కాబోతోందా అనిపిస్తోంది. అందుకే ఈ మూవీ ట్రైలర్ కు అద్భుతమైన రివ్యూస్ వస్తున్నాయి. అదితిరావు హైదరికి ఇది తొలి మళయాల సినిమా. ట్రైలర్ ఆసాంతం తను ఓ దేవకన్యలా కనిపిస్తోందంటే అతిశయోక్తి కాదు. మొత్తంగా ఈ ట్రైలర్ విడుదలైన వెంటనే ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. వచ్చే నెల 3న ఈ చిత్రాన్ని ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *