SPB First Remuneration Rs.300
సంగీత ప్రపంచంలో తనకంటూ పేరు తెచ్చుకున్న ఎస్పీబి జీవితం పూలపాన్పేం కాదు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అప్పటికే ఘంటసాల గాత్రానికి అలవాడు పడ్డ జనం తన పాటలను వింటారా? అయోమయంలో పడ్డారు. తన లాగే ఎంతోమంది సింగర్స్ ఉన్నారని, వాళ్లందరికి భిన్నంగా ఉండాలనే తపత్రయంతో హీరోల వాయిస్ కు తగ్గట్టుగా పాటలు పాడేవారు. హీరోల వాయిస్ గమనించి, సేమ్ టు సేమ్ అలాగే పాడేవాడు. అలా బాలుకు తెలుగు ప్రేక్షకులు పట్టం కట్టారు. ఘంటసాల మరణంతో తెలుగు సంగీతానికి బాలు పెద్ద దిక్కయ్యాడు. తన గాత్రంతో మైమరిపించాడు. కొడుకును ఎస్సీ చరణ్ ను తనలాగే ప్రయోజకుడ్ని చేయాలనుకొని ఎన్నో కలలు కన్నాడు. కానీ తండ్రి తగ్గ తనయుడు అనిపించుకోలేకపోయాడు. బాలు శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రానికి మొదటి రెమ్యూనరేషన్ 300 తీసుకున్నారు.
ముఖ్యంగా శంకరాభరణం సినిమా బాలుకు మంచి పేరు తెచ్చుకుంది. ఎస్పీ బాలు సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 1979 లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు 1981 లో బాలీవుడ్ లో ప్రవేశించి ఏక్ దూజే కేలియే చిత్రానికి గాను రెండోసారి పురస్కారాన్ని అందుకున్నాడు. తర్వాత సాగర సంగమం(1983), రుద్రవీణ (1988) చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషన్ వరించింది. 1999లొ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది.