స్పీకర్ కి కోర్టు నోటీసులిస్తుందంటే అర్ధం అదేగా అన్న భట్టి

Spread the love
Speaker is notified that the court is issued notice
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ప్రలోబాలకు గురిచేస్తూ పార్టీలో చేర్చుకుంటోందని ఆయన ఆరోపించారు. ఈ పార్టీ పిరాయింపులపై తమ పోరాటం కొనసాగుతుందని భట్టి స్పష్టం చేశారు. శాసన సభ కోటా ఎమ్మెల్సీ స్థానాలకోసం మంగళవారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గాంధీ భవన్ లో భట్టి మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల కోసమే తమ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ చేర్చుకోడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారన్నారు.
ఎమ్మెల్యేల ఫిరాయింపులపై తాము ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలియజేస్తామని ప్రకటించారు. అందులో భాగంగా మొదట కాంగ్రెస్ పార్టీ తరపున సభాపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. తగిన సమయంలో ఆయన చర్యలు తీసుకోకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. గతంలో స్పీకర్ స్పందించకుంటే హైకోర్టుకు వెళ్లామని భట్టి గుర్తుచేశారు. అప్పుడు కోర్టు సభాపతికి నోటీసులు జారీ చేశారని… ఇలా టీఆర్ఎస్ అత్యున్నతమైన స్పీకర్ పదవిని కూడా దిగజార్చారని భట్టి విమర్శించారు.
తెలంగాణ లో ప్రతిపక్షాలే లేకుండా చేయాలని కేసీఆర్ చేయాలనుకుంటున్నారని అన్నారు. కానీ ప్రతిపక్షం లేకుంటే ప్రజాస్వామ్యమే ఉండదన్నారు. ఇలా ఆయన ప్రజాస్వామ్యాన్నే ప్రమాదంలోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కుట్రలపై రాష్ట్ర ప్రజల్ని, రాజకీయ పార్టీలను సమాయత్తం చేస్తామన్నారు. ఈ రాచరిక పరిపాలనపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగేలా చేస్తామని…అందుకోసం యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.

Interesting News about Priyanka Chopra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *