నానిలా అల్లు అర్జున్ కూ ఓ పాట ఉందట

specal song in pushpa

స్టైలిష్ స్టార్ గా తిరుగులేని క్రేజ్  సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడుగా వెలుగుతున్నాడు. అల వైకుంఠపురములోతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న బన్నీ .. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ‘పుష్ప’అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీలో అతను ఇంత చేయని పాత్రలో కనిపించబోతున్నాడు. రఫ్ అండ్ టఫ్ లుక్ తో పాటు ఆ పాత్ర కూడా అలానే రగ్గ్ డ్ గా ఉండేలా ప్లాన్ చేశాడు సుకుమార్. రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో స్పెల్ బౌండ్ చేశారు కూడా. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇతర కీలక పాత్రల్లో కూడా చాలామంది క్రూసియల్ ఆర్టిస్టులనే తీసుకున్నాడు. దీంతో సినిమాపై మంచి అంచనాలే పెరిగాయి. మరోవైపు అల వైకుంఠపురములో సినిమాకు వచ్చిన అనూహ్య గుర్తింపు నేపథ్యంలో పుష్పను ప్యాన్ ఇండియన్ లెవల్లో విడుదల చేయబోతున్నారనేది ఇప్పటికే చెప్పేశారు.

ఇక ఈ సినిమా చిత్తూరు నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి సినిమాలోని ప్రధాన పాత్రలన్నీ చిత్తూరు స్లాంగ్ లోనే మాట్లాడతాయి. అందులో భాగంగా ఈ మూవీలో ఓ ఐటమ్ సాంగ్ ఉందని కూడా వినిపిస్తోంది కదా. ఈ ఐటమ్ సాంగ్  కూడా చిత్తూరు ప్రాంతంలోని జానపదం స్టైల్లో ఉంటుందట. అంటే గతంలో నాని హీరోగా నటించిన కృష్ణార్జున విజయం చిత్రంలో దారి చూడు దమ్మూ చూడూ మామా అనే పాట తరహాలో అన్నమాట. మామూలుగానే ఐటమ్ సాంగ్ అంటే ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక ఫోక్ అది కూడా పర్టిక్యులర్ గా ఓ ప్రాంతానికి సంబంధించిన ఫోక్ అంటే ఇంక చెప్పేదేముందీ.. అటు దేవీ శ్రీ వాయింపుడుకు బన్నీ స్టెప్పులు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని వేరే చెప్పక్కర్లేదేమో.. మొత్తంగా మన స్టార్లు కూడా ఊర్లు అంటూ కథలకు సరెండర్ కావడం ఓ మంచి పరిణామంగానే చెప్పాలి.

tollywood news

Related posts:

బుట్టబొమ్మకు గట్టి షాకే ఇస్తున్నారుగా..?
14 వేల మంది సినీ కార్మికులకు సాయం
సుమంత్ కూడా బరిలో ఉన్నా అంటున్నాడు.. 
మహేష్ బాబుపై ఆశలు వదులుకుంటే మంచిదేమో..?
ఆర్ట్ డైరెక్టర్స్ కు మంచి రోజులు వస్తున్నాయా..?
మహేష్ ను చూస్తే మైమరచిపోవాల్సిందే
థియేటర్లు తెరిచేదెప్పుడు?
పూరీ జగన్నాథ్ ‘ముంబై టార్గెట్’ రీచ్ అయ్యాడా..?
కరోనాపై ఫస్ట్ మూవీ తీసిన రామ్ గోపాల్ వర్మ
నాని  కూడా ఆ ఇమేజ్ కోరుకుంటున్నాడా..?
వెంకటేష్, నానీలతో త్రివిక్రమ్ సినిమా?
అనిల్ రావిపూడి ఆవేశం సరే.. అవతల హీరోలెవరు బాస్
ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ దాడి మొదలుపెట్టారు
నవదీప్ భార్యను చంపింది ఎవరు...?
టాలీవుడ్ లో మళ్లీ గ్రూపులు మొదలవుతున్నాయా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *