వైసీపీ టార్గెట్ గా ప్రత్యేక హోదా నినాదంతో బాబు

Special Status Slogan As YCP Target

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ వాసులంతా కోరుకుంటున్న ఏకైక అంశం ప్రత్యేక హోదా అంశం. ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశం ఆధారంగా అన్ని పార్టీలు ప్రచారం నిర్వహించాయి. ఇక గత ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని తెరమీదికి తెచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి.

2019 మే నాటి ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశంపై మూడు ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ, బీజేపీలు ఎవరి వాదన అవి వినిపించాయి. ఫలితం వైసీపీకి అనుకూలంగా వచ్చింది. ఆ తర్వాత ప్రత్యేక హోదా అంశం దాదాపు తెరమరుగైనట్లే భావిస్తున్న తరుణంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ మరోసారి ప్రత్యేక హోదా అంశంపై గళమెత్తారు. ప్రత్యేక హోదాను వైసీపీ పక్కన పెట్టిందని, ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉభయ సభల్లోను వైసీపీ ఎంపీలు రాష్ట్ర సమస్యలు లేవనెత్తలేదని ఆరోపణలు గుప్పించారు. జగన్ తమ 23 మంది ఎంపీలను ప్రధాని మోదీ వద్దకు పంపి, ప్రత్యేక హోదా సహా విభజన హామీలను సాధించాలని రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు.

పార్లమెంటు సెషన్ ముగిసే వరకు ఆగి.. ఉన్నట్లుండి టీడీపీ నేతలు ప్రత్యేక హోదా అంశాన్ని తెరమీదికి తేవడం చంద్రబాబు వ్యూహంలో భాగమేనని చెప్పుకుంటున్నారు. ఈ అంశాన్ని ఆధారం చేసుకుని.. తమ హయాంలో వచ్చిన నిధులను, ఇప్పుడు జగన్ హయాంలో జరుగుతున్న అన్యాయాన్ని కంపేర్ చేసి చూపడం ద్వారా ప్రజల్లోకి ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకువెళ్ళాలని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు విశ్లేషించుకుంటున్నాయి. ఏదేమైనప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేవరకు ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఈ అంశం ఎప్పుడు వజ్రాయుధమే. అధికార పక్షంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రత్యేక హోదా అంశంతో టార్గెట్ చేయడం పరిపాటిగా మారింది.

tags: Andhrapradesh, tdp, ycp, jagan, special status, ravindra kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *