ప్రత్యేక హోదా విభజన అంశాలపై ఏపీ అసెంబ్లీ లో మాటల యుద్ధం

Speech In AP Assembly On Special Status Separation Issues

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. తొలిరోజే ఏపీ అసెంబ్లీ లో విభజన అంశాలు, ప్రత్యేక హోదాపై వాడి వేడి చర్చ జరుగుతోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు 23 మంది పార్లమెంటు సభ్యులను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారని సభలో అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. కానీ నేటి వరకు ప్రత్యేక హోదా విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి పై సభలో ప్రస్తావించారు అచ్చెన్న.

ఇక అంతే కాదు టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం ఢిల్లీ వెళ్తున్నారు.. వస్తున్నారు.. అక్కడ ఇంటర్వ్యూలు లభించటం లేదా అని నిలదీసారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చల ఫలితంగా 68 విభజన అంశాల్లో పరిష్కారం లభించిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ప్రభుత్వం హోదా కోసం నిలబడి ఉంటే ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని అధికార పార్టీ పేర్కొంది. ప్యాకేజికి అంగీకరించటం వలనే హోదా రాలేదని అధికార పక్షం ఫైర్ అయింది. ఓటు కు నోటు కారణం గా హైదరాబాద్ వదిలి వచేసారంటూ చంద్రబాబు పైన వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. అయితే, తాము హోదా సాధించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అసెంబ్లీలో విభజన అంశాలు, హోదా పైన జరిగిన చర్చలో మంత్రి కన్నబాబు, అచ్చెన్నాయుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈక్రమంలో ఆయన గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. టిడిపి హయాంలోనే సాధించాల్సిన ప్రత్యేక హోదా, టిడిపి అసమర్థత వల్ల సాధించలేక పోయిందని, నాటి ప్రభుత్వం ప్యాకేజీకి ఒప్పుకోకుండా ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. అదేవిధంగా టిడిపి హయాంలో తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఏపీ భవనాలు ఆక్రమించుకుంటే ఏమీ చేయలేకపోయారని, మరో ఐదేళ్లు కష్టపడితే గానీ సమస్యలు కొలిక్కి వచ్చే అవకాశం లేదని మంత్రి కన్నబాబు తెలిపారు. ఇక హోదాపై, విభజన అంశాలపై అటు టీడీపీ వైసీపీ నేతల మాటల తూటాలతో సభలో తొలిరోజే రచ్చ కొనసాగింది.

tags : AP Assembly Session, TDP, YCP, achhennaydu, special status, bifurication issues, jagan mohan reddy, jagan, minister kanna babu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *