రికార్డు స్థాయిలో స్పైస్ జెట్ మొదటి త్రైమాసిక లాభాలు

SpiceJet makes record profits in first quarter

ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుని ఇబ్బందులు పడిన స్పైస్  జెట్ క్రమంగా కోలుకుంటోంది.  గత త్రైమాసికంలో 38 కోట్ల నికర నష్టాలు  వచ్చిన స్పైస్‌జెట్‌  కంపెనీ  ఈ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో లాభాన్ని సాధించింది.  స్పైస్ జెట్ కంపెనీ మళ్లీ లాభాల్లోకి రావడమే కాకుండా, ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో   మంచి లాభాన్ని సాధించింది.ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో స్పైస్‌జెట్‌ షేర్‌ 1 శాతం లాభంతో రూ.138 వద్ద ముగిసింది.

స్పైస్ జెట్ క్రమంగా  లాభాల బాట పడుతోంది. ఈ త్రైమాసికంలో బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమాన సర్వీసులను నిలిపేసినప్పటికీ, ఈ కంపెనీ ఈ క్యూ1లో రూ.262 కోట్ల నికర లాభం సాధించింది.  గత క్యూ1లో రూ.38 కోట్ల నికర నష్టాలు వచ్చాయని  కానీ  ఈసారి నష్టాలను అధిగమించి  లాభాలు  సాధించామని స్పైస్ జెట్ కంపెనీ చీఫ్  ఫైనాన్షియల్ ఆఫీసర్  కిరణ్ కోటేశ్వర్ తెలిపారు . ఇక కంపెనీకి సంబంధించి గత క్యూ1లో రూ.2,253 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.3,145 కోట్లకు పెరిగిందని  ఆయన పేర్కొన్నారు .  నష్టాలు వస్తుండడంతో బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాల నిలిపివేసిన  సంస్థ   బోయింగ్  737 మ్యాక్స్‌ విమానాల  నిలిపివేత ప్రభావం ఈ జూన్‌ క్వార్టర్‌లో బాగానే  చూపించిందని కిరణ్‌ కోటేశ్వర్‌ తెలిపారు. ఈ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, నిర్వహణ ఆదాయం రూ.2,220 కోట్ల నుంచి రూ.3,002 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.  ఇక సగటువిమాన చార్జీ 11 శాతం పెరిగిందని పేర్కొన్నారు.  అందువల్లే  నిర్వహణ ఆదాయం ఇంతగా పెరిగినట్లుగా ఆయన పేర్కొన్నారు.  అంతేకాదు   జూన్ చివరి నాటికి  స్పైస్ జెట్ నుండి 107 విమానాలతో సర్వీసులను అందిస్తున్నామని  కిరణ్ కోటేశ్వర్ తెలిపారు.  ఈ ఏడాది అక్టోబర్ కల్లా బోయింగ్ 737 ఎన్జీ విమానాలను  5 నుండి 10 వరకు సర్వీసులోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

stock market updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *