అగ్రస్థానానికి సన్ రైజర్స్

Spread the love

SRH WON 3RD MATCH

  • ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలుపుతో హైదరాబాద్ కి హ్యాట్రిక్ విజయం

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి ఊపు మీదున్న ఆ జట్టు.. తాజాగా మూడో మ్యాచ్ లోనూ గెలిచి హ్యట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గురువారం ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో జయకేతనం ఎగురవేసి టోర్నీలో అగ్రస్థానానికి చేరింది. ఢిల్లీ నిర్దేశించిన 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మరో 9 బంతులు ఉండగానే అందుకుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా(11), శిఖర్‌ ధావన్‌(12) విఫలం కావడంతోపాటు రిషభ్‌ పంత్‌(5) కూడా నిరాశపరచడంతో ఢిల్లీ కోలుకోలేకపోయింది. శ్రేయస్‌ అయ్యర్‌(43), అక్షర్‌ పటేల్‌(23 నాటౌట్‌), క్రిస్‌ మోరిస్‌(17) ఆదుకోవడంతో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, నబీ, సిద్దార్థ్‌ కౌల్‌ఖ తలో రెండు వికెట్లు తీయగా.. రషీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మలు చెరో వికెట్‌ తీశారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ కు అద్భుతమైన ఆరంభం లభించింది. బెయిర్ స్టో(48) వీర విహారం చేయడంతో పది ఓవర్లలోనే మ్యాచ్ ముగిసిపోతుందేమో అనిపించింది. అయితే, అతడు ఔట్ అయిన తర్వాత వార్నర్‌(10), విజయ్‌ శంకర్‌(16), పాండే(10), హుడా(10) కూడా పెవిలియన్ చేరడంతో సన్ రైజర్స్ విజయం ఆలస్యమైంది.

SPORTS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *