అప‌రిష్కృత స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించాలి

Srikakulam JAC Strike To Day

అప‌రిష్కృత స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించి, ఉద్యోగుల ప‌క్ష‌పాతిగా ప్ర‌భుత్వం మంచి పేరు తెచ్చుకోవాల‌ని, దీర్ఘ‌కాలి కంగా ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్న కొన్ని అంశాల‌పై ఇప్ప‌టికీ స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌ని పేర్కొంటూ జిల్లా జేఏసీ ఒక రోజు ధ‌ర్నా ను క‌లెక్ట‌రేట్ ఎదుట మంగ‌ళ‌వారం నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర స‌హాధ్య‌క్షులు చౌద‌రి పురుషోత్తం నా యుడు మాట్లాడుతూ.. సీపీఎస్ ర‌ద్దుకు సంబంధించి  ఇప్ప‌టికే అనేక మార్లు ఉద్య‌మాల‌ను చేప‌ట్టామ‌ని, యువ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అప్ప‌టి పాద‌యాత్ర‌లో ఓ స్ప‌ష్ట‌త ఇస్తామ‌ని చెప్పినా నేటికీ అది ఓ కార్య‌రూపం దాల్చ‌లేద‌ని, గ్రూప్ ఆఫ్ మినిస్ట‌రీస్ డైరెక్ష‌న్ ఏంట‌న్న‌ది ఇప్ప‌టికీ తెలియ‌డం లేద‌ని వాపోయారు. ఉద్యోగుల‌కు 55శాతం ఫిట్మెంట్ తో పాటు కొత్త పీఆర్సీకి సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాలు సంబంధిత చర్య‌లు వేగ‌వంతం చేయాల‌ని జేఏసీ చైర్మ‌న్ హ‌నుమంతు సాయిరాం కోరారు. ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై వ‌చ్చే ఎనిమిదిన జ‌రిగే దేశ‌వ్యాప్త స‌మ్మెను విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు.
మ‌రికొన్ని డిమాండ్లు – నిర‌స‌న స్వ‌రాలు

– జాతీయ నూత‌న విద్యావిధానాన్ని వ్య‌తిరేకిస్తున్నాం
– అదేవిధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం తెలుగు మాధ్య‌మాన్ని ర‌ద్దు చేయడాన్ని నిర‌సిస్తున్నాం
– కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగినుల‌కు మాదిరిగానే రెండేళ్ల పాటు చైల్డ్ కేర్ లీవ్ ను మంజూరు చేయాలి
– నాల్గో త‌ర‌గ‌తి ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు  62 సంవ‌త్స‌రాల‌కు పెంచాలి
– రాష్ట్రీయ మాధ్య‌మిక శిక్షా అభియాన్ (ఆర్ఎంఎస్ఏ) టీచ‌ర్ల జీతాలు చెల్లించాలి
– అన్ని ప్ర‌భుత్వ శాఖల‌లో ఉన్న ఖాళీల‌నూ త‌క్ష‌ణ‌మే భ‌ర్తీ చేయాలి
కార్య‌క్ర‌మంలో ప‌లు సంఘాల నాయ‌కులు పాల్గొన్నారు.

Srikakulam JAC Strike To Day,Srikakulam News,Employees,AP Governament,Collector Office,AP NGO State President,CPS,JAC Chairman Hanumathu Sairam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *