Srisailam Dam in danger
శ్రీశైలం డ్యాం ప్రమాదంలో పడిందా? వాటర్ మాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ ఏమంటున్నారు? ఎందుకు శ్రీశైలం డ్యాం ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఉందని ఆయన చెబుతున్నారు? అన్నది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. వాటర్ మాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ శ్రీశైలం ప్రాజెక్టు పై బాంబు పేల్చారు. శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్ లో కృష్ణా నదిపై నిర్మించిన భారీ బహుళార్థసాధక ప్రాజెక్టు డ్యాంకు ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ ని అప్పటి ప్రధాని నెహ్రు గారు 1963 లో ప్రారంభించారు. శ్రీశైలం ప్రాజెక్టు కేవలం జలవిద్యుత్తు ప్రాజెక్టుగానే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు తరువాతి కాలంలో సాగునీటి, తాగునీటి అవసరాలను కూడా తీర్చడం తో బహుళార్థసాధక ప్రాజెక్టుగా మారింది. కానీ ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందంటున్నారు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్. తాజాగా ఆయన శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు. ఈ విషయం పై ఆయన మీడియాతో మాటాడుతూ… శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని. వెంటనే మరమ్మతులు చేయకపోతే పెను విషాదం తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వాలు నదులపై ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయే తప్ప వాటి నిర్వహణ బాధ్యతలు సరిగా చూసుకోవడం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఒక విపత్తు సంభవిస్తే రాష్ట్రం మొత్తం కనిపించకుండా పోతుందని అయన ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే శ్రీశైలం డ్యాం సమీపంలో జరుగుతున్న నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఎంత త్వరగా చర్యలు చేపడితే శ్రీశైలం ప్రాజెక్టుకు అంత మంచిది అని తెలిపారు.
tags: andhra pradesh, srisailam dam, water man of india, rajendra singh, visit, danger bells