ఎస్ఆర్ఎస్పీ కాలువల పేరు మార్పు

srsp name changed

మహబూబాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేస్తున్న ఎస్.ఆర్.ఎస్.పి కాలువలు క్షేమంగా ఉండాలని, వాటి ద్వారా పారే నీటితో జిల్లా పచ్చగా పది కాలాల పాటు ఉండాలని ఈ కాలువలకు శ్రీవీరభద్ర స్వామి, భద్రకాళి పేర్లు పెడుతున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. మహబూబాబాద్ లో ఒక కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఎస్.ఆర్.ఎస్.పి స్టేజీ 1 వెన్నెవరం కాలువకు శ్రీ వీరభద్ర స్వామి పేరు, ఎస్.ఆర్.ఎస్.పి స్టేజీ 2 కాలువకు భద్రకాళి అమ్మవారి పేరు పెడుతున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ అపర భగీరథ ప్రయత్నం ద్వారా నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మహబూబాబాద్ జిల్లాలో కూడా నేడు ఎండాకాలంలో చెరువుల్లో నీరు ఉందన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసిఆర్ రైతు కావడం వల్ల రైతుల కష్టాలు తెలిసి, రైతును రాజు చేసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారన్నారు. రైతుకు ఎకరం, అరఎకరం ఉన్నా రైతుబంధు వస్తుందన్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద కంటే మహబూబాబాద్, డోర్నకల్ నియోజక వర్గాల్లో ఎక్కువ పంటలు పండాలన్నారు. ఎస్.ఆర్.ఎస్.పి స్టేజీ 1, స్టేజీ 2 కాలువల ద్వారా డోర్నకల్ చివరి ఆయకట్టు వరకు నీరు వచ్చే విధంగా అన్ని చెరువులు నింపుతామన్నారు. ఓటీలు లేని చెరువులు గుర్తించి, ఈఎన్సీ, సిఈలతో, ప్రజా ప్రతినిధులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి ఓటీలు నిర్మించే ప్రయత్నం చేస్తామన్నారు.

TelanganaLatestNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *