‘ఏజెంట్’ పాప .. భారతీయుడు వరకూ ఎలా వెళ్లింది..?

sruthi in Indian-2

తెలుగులో డిటెక్టివ్ సినిమాలు చాలా అంటే చాలా తక్కువనే చెప్పాలి. ఇక ఈ మధ్య కాలంలో అసలు కనిపించడం లేదు. ఆ లోటును తీరుస్తూ.. కొత్త కుర్రాడు నవీన్ పోలిశెట్టి హీరోగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే సినిమాతో వచ్చాడు. స్వరూప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. కమర్షియల్ గా సైతం ఆకట్టుకుంది. ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా ఇలాంటి సినిమాల్లోని ఎగ్జైట్మెంట్ నూ మిస్ చేయకుండా ఆకట్టుకున్నారీ కుర్రాళ్లు.. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా టిక్ టాక్ తో ఆకట్టుకున్న శ్రుతి శర్మ నటించింది. అమ్మడికి రెగ్యులర్ హీరోయిన్ రోల్ కాకపోయినా.. తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. నటన పరంగానూ ఫర్వాలేదు అనిపించుకుంది. అలాంటి భామకు ఇప్పుడు భారీ సినిమా భారతీయుడు -2లో చాన్స్ వచ్చిందనే వార్త టాలీవుడ్ లో ఆశ్చర్యపరుస్తోంది. కమల్ హాసన్ ఎపిక్ మూవీ భారతీయుడుకు సీక్వెల్ గా వస్తోన్న భారతీయుడు-2 పై భారీ అంచనాలున్నాయి. శంకర్ డైరెక్షన్ లోనే రూపొందుతోన్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్ తో పాటు సిద్ధార్థ్, శింబులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయినా.. అంతకుముందే రెండు నెలలుగా షూటింగ్ నిలిచిపోయింది. కొన్నాళ్ల క్రితం సెట్స్ లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. అప్పటి నుంచే భారతీయుడు-2 చిత్రీకరణ ఆగిపోయింది. ఈలోగా లాక్ డౌన్ కూడా వచ్చింది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత మళ్లీ షూటింగ్ మొదలవుతుంది. ఇక ఈ సినిమాలో ఓ పాత్రకు ఏజెంట్ బ్యూటీని ఎంపిక చేశారు అనే వార్త నిజంగానే టాలీవుడ్ ను ఆశ్చర్యపరుస్తోంది. ఆ సినిమా తర్వాత ఇక్కడే ఎవరూ పట్టించుకోలేదీ పాపను. అలాంటిది అంత పెద్ద ప్రాజెక్ట్ కు ఎంపిక కావడం విశేషమే. కాకపోతే ఇలాంటి వార్తలు ఈ మధ్య తరచూ వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ భామే క్లారిటీ ఇచ్చే వరకూ దీన్ని రూమర్ గానే భావిస్తే బెటర్.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *