శ్రుతి హాసన్ మరీ రెచ్చిపోయిందా..?

4
sruthihasan movie update
sruthihasan movie update

sruthihasan movie update

కమల్ హాసన్ కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆయన పేరుతో కాక తన స్వయంకృషితోనే గుర్తింపు తెచ్చుకంది శ్రుతి హాసన్. అయితే ఒక హిట్ కోసం చాలాయేళ్లే ఎదురు చూడాల్సి వచ్చింది. మొదట్లో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో అక్కడ ‘ఇంటిమేట్ సీన్స్’ట్రెండ్ నడుస్తోంది. అవి చేసిన వాళ్లే హిట్స్ అందుకుంటున్నారు. దీంతో తనూ కమల్ హాసన్ ఇమేజ్ ను పట్టించుకోకుండా కొన్ని సినిమాల్లో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది కూడా. బట్ అవేవీ తనకు హిట్ తేలేదు. ఆ టైమ్ లో అనుకోకుండా తెలుగులో వచ్చిన అవకాశం తనకు బ్లాక్ బస్టర్ తెచ్చింది. అది గబ్బర్ సింగ్ అని వేరే చెప్పక్కర్లేదు. అప్పటికే తెలుగులో కొన్ని సినిమాలు చేసినా.. గబ్బర్ సింగ్ తో శ్రుతి హాసన్ కు తిరుగులేని గుర్తింపు వచ్చింది. విశేషం ఏంటంటే.. ఏ భాషలో అయినా తనకు వచ్చిన తొలి హిట్ ఇదే. ఈ మూవీ తర్వాత తెలుగుతో పాటు తమిళ్ లోనూ చాలా బిజీ అయిపోయింది. పవన్ కళ్యాణ్ తో కాటమరాయుడులో రెండోసారి రొమాన్స్ చేసింది. ప్రస్తుతం వకీల్ సాబ్ లోనూ నటిస్తోంది. అయితే లేటెస్ట్ గా తను ఓ వెబ్ సిరీస్ లో నటించింది. అదీ తెలుగులోనే. ఈ సిరీస్ ఇంకా రాలేదు.

కానీ ఓ విషయంలో మాత్రం శ్రుతి హాసన్‘హాట్’అప్పుడే టాపిక్ అయిపోయింది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ లలో ‘లస్ట్ స్టోరీస్’ఒకటి. ఈ సిరీస్ లో ఎవరు ఎలా చేసినా హైలెట్ అయింది మాత్రం కియారా అద్వానీ స్టోరీయే. అందుకు కారణం అందులోని కంటెంట్ తో పాటు కాస్త హై డోస్ గా ఉన్న రొమాన్స్ కూడా. ప్రస్తుతం ఈ సిరీస్ ను తెలుగులో చేస్తున్నారు. తెలుగులో కియారా చేసిన పాత్రలో శ్రుతి హాసన్ నటించింది. అయితే ఒరిజినల్ కంటే చాలా ఎక్కువగానే శ్రుతి హాసన్ అదరగొట్టిందట. మాస్టర్బేషన్ సీన్ నుంచి బెడ్ సీన్ తో పాటు స్కిన్ షో విషయంలోనూ కియారాను మించి డబుల్ రేంజ్ లో రెచ్చిపోయింది అనేది వినిపిస్తోంది. మామూలుగా తను ఎలాంటి పాత్రైనా చేస్తుంది. కెరీర్ ఆరంభంలోనే బికినీ వేసింది. ఇంటిమేట్ సీన్స్ చేసింది. అందువల్ల ఇప్పుడు చేయడం పెద్ద విషయమేం కాదనుకోవచ్చు. కాకపోతే సిరీస్ విడుదలకు ముందే వదులుతోన్న ఇలాంటి ఫీలర్స్ తో ఖచ్చితంగా తెలుగు వెర్షన్ కు డిమాండ్ పెరుగుతుందనే చెప్పాలి.

tollywood news