స్టార్ హీరోల భారీ ప్లాన్స్  

1
telugu cinema
telugu cinema

star heroes plans

పెద్ద హీరోల కెరీర్ ప్లానింగ్స్ వేరే ఉంటాయి. అందర్లా హడావిడీగా సినిమాలు చేయరు. భారీ బడ్జెట్ తో రూపొందే ఆ సినిమాలకు హడావిడీగా చేస్తే ఆ తర్వాత ఏమాత్రం తేడా వచ్చిన నష్టాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అందుకే కాస్త సినిమా తర్వాత సినిమా అంటూ వెళుతుంటారు. కానీ కొన్నాళ్లుగా ట్రెండ్ మారింది. ఒక సినిమా చేస్తూనే మరో సినిమా లైన్ లో ఉంచుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లోని అందరు పెద్ద స్టార్స్ ఈ పద్ధతి ఫాలో అవుతున్నారు ఒక ఇద్దరు హీరోలు తప్ప. వీరిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ చేస్తున్నాడు. అయితే ఈ మూవీతో పాటే.. దాదాపు యేడాది క్రితమే మరో సినిమా కూడా సెట్ చేసి పెట్టుకున్నాడు. అదీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ కు వెళ్లాడు. త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆర్ఆర్ఆర్ లేట్ కావడంతో పాటు ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఆ షూటింగ్ చాలా ఆలస్యం అవుతోంది. ఆ తర్వాతే త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కుతుంది. మరోవైపు ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్, అట్లీలతోనూ  సినిమా చేస్తాడు అనే ప్రచారమూ జరుగుతోంది. సో.. వరస ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టుకుంటున్నాడన్నమాట.

ఈ లిస్ట్ లోకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరాడు. మామూలుగా ఒక్కో సినిమా చేసే అల్లు అర్జున్ .. అల వైకుంఠపురములోతో పాటే మరో మూడు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు. సుకుమార్ తో పుష్ప, దిల్ రాజు బ్యానర్ లో ఐకన్. మొదటి సినిమా అయిపోయింది. ప్రస్తుతం పుష్ప షూటింగ్ మొదలై ఆగిపోయింది. అయితే తర్వాత అంతా ఐకన్ అనుకున్నారు బట్ అతను సడెన్ గా కొరటాల శివతో సినిమా అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచాడు. కారణాలేవైనా.. అల్లు అర్జున్ పుష్ప తర్వాత వెంటనే కొరటాలతో సినిమా రెడీగా పెట్టుకున్నాడు. వీరిలాగానే కాస్త ఆలస్యంగా సినిమాలు చేసే ప్రభాస్ కూడా దూకుడు పెంచుతున్నాడు. ప్రస్తుతం రాధేశ్యామ్ మూవీ చేస్తోన్న ప్రభాస్ రీసెంట్ గా వైజయంతి బ్యానర్ లో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ ఫాంటసీ సినిమా అనౌన్స్ చేశాడు. దీపికా పదుకోణ్ ను హీరోయిన్ గా ఫైనల్ చేశారు. అంటే వచ్చే రెండేళ్లలో ప్రభాస్ నుంచి రెండు సినిమాలు ఖచ్చితంగా విడుదలవుతాయి అని చెప్పొచ్చు. మహేష్ బాబు మాత్రం ఎప్పట్లానే స్లోగానే ఉన్నాడు. ఇలా రెండో సినిమా ఇంకా లైన్ లో పెట్టుకోలేదు. ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట చేస్తున్నాడు సూపర్ స్టార్.

ఈ మూవీ తర్వాత ఏం చేస్తాడు అనే ప్రశ్నకు ఆన్సర్ ఇప్పుడైతే లేదు. కాకపోతే ప్రశాంత్ నీల్ తో సినిమా ఉండొచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి. అలాగే ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ కు మైత్రీ బ్యానర్ అడ్వాన్స్ ఇచ్చింది కదా. ఆ బ్యానర్ లో లోకేష్ తోనూ మూవీ ఉండే అవకాశం ఉంది. కానీ ఈ రెండూ ఇంకా ఫైనల్ కాలేదు. ఇక రామ్ చరణ్ కూడా అంతే. ఆర్ఆర్ఆర్ తర్వాత మెగాస్టార్ మూవీ ఆచార్యలో ఓ కీలక పాత్ర చేస్తాడు. కాకపోతే ఆర్ఆర్ఆర్ లేట్ కావడంతో ఆచార్య ముందు అవుతుంది. అంటే రౌద్రరణ రుధిరం తర్వాత చరణ్ తర్వాత ప్రాజెక్ట్ ఏంటీ అనేది ఇంకా తేలలేదు. అలాగే చరణ్.. సురేందర్ రెడ్డి, వంశీ పైడిపల్లి, వెంకీ కుడుముల, లోకేష్ కనకరాజ్ లతో సినిమా చేస్తాడు అనే రూమర్స్ గట్టిగా వినిపించాయి. బట్ వీటిని రీసెంట్ గా అతను ఖండించాడు. ఫైనల్ గా పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ కెరీర్ ఎప్పుడూ లేని విధంగా ఏకంగా ఒకేసారి మూడు సినిమాలు ప్రకటించాడు. వీటిలో వకీల్ సాబ్ చివరి దశలో ఉంది. క్రిష్ మూవీ ప్రారంభం అయింది. నెక్ట్స్ హరీశ్ శంకర్ తో సినిమా ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి ఈ మూడు సినిమాలూ పూర్తి చేస్తాడు పవన్ కళ్యాణ్. సో.. మన స్టార్స్ అంతా ఇలా వరుస సినిమాలతో రెడీగా ఉంటున్నారన్నమాట.

tollywood news