విజేత‌లుగా ఎద‌గండి..వ్య‌క్తిత్వం చాటుకోండి

State Level Swimming Competitions

నిరంత‌రం ప‌రిశ్ర‌మిస్తూ, త‌మ‌ని తాము తీర్చిదిద్దుకుంటూ ఎదిగిన వారే కాలాన‌గుణంగా రాణించ‌డ‌మే కాక, చరిత్ర‌లో నిలిచిపోయే స్థాయిలో ప్ర‌ముఖంగా పేరు తెచ్చుకుంటార‌ని క‌లెక్ట‌ర్ జె.నివాస్ అన్నారు. స్థానిక శాంతి న‌గ‌ర్ లో కాల‌నీలో జిల్లా స్విమ్మింగ్ అసోసియేష‌న్ నేతృత్వాన ఏర్పాటు చేసిన ఐదో రాష్ట్ర‌స్థాయి పోటీల‌కు ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. ఆయ‌న‌తో పాటు మ‌రో ఆత్మీయ అతిథిగా శ్రీ‌కాకుళం శాస‌న స‌భ్యులు, సీనియ‌ర్ పొలిటీషియ‌న్ ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు హాజ‌ర‌య్యారు. వీరిని పోటీల నిర్వాహ‌కులు, జిల్లా స్విమ్మింగ్ అసోసియేష‌న్ అధ్యక్షులు కేఎన్ఎస్వీ ప్ర‌సాద్ (హారికా ప్ర‌సాద్) ఆహ్వానించి, క్రీడాకారుల‌ను ప‌రిచ‌యం చేశారు. ఈ సంద‌ర్భంగా ప్రారంభోప‌న్యాసం చేసిన క‌లెక్ట‌ర్ .. క్రీడాకారులలు నైతిక‌త పెంచుకోవ‌డంతో పాటు సామాజిక బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హించేందుకు సైతం ముందుకు రావాల‌ని అటువంట‌ప్పుడే పౌర స‌మాజంలో మ‌రింత ఉన్న‌తి సాధించ‌డం సాధ్య‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

కొన్ని ఒడిదొడుకుల‌కు ఓర్చి ఈ పోటీల‌ను అత్యంత స‌మ‌ర్థ‌నీయ స్థాయిలో, ప్ర‌శంస‌నీయ రీతిలో నిర్వ‌హిస్తున్న జిల్లా స్విమ్మింగ్ అసోసియేష‌న్ ను ఎమ్మెల్యే ధ‌ర్మాన తో స‌హా ఇత‌ర అతిథులు మెంటాడ వెంక‌ట ప‌ద్మావ‌తి, వైఎస్సార్సీపీ నాయ‌కులు వ‌రం, వైవీ సూర్య‌నారాయ‌ణ, చీఫ్ కోచ్ బి.శ్రీ‌నివాస‌రావు అభినందించారు. ఈ పోటీల‌లో విజేత‌లుగా నిలిచిన వారు సౌత్ జోన్ పోటీల‌కు అర్హ‌త సాధించిన వారు అవుతార‌ని, అదేవిధంగా జిల్లాలో ప్ర‌తిభ ఉండి, పేద‌రికం కార‌ణంగా రాణించ‌లేని స్థితిలో ఉన్న క్రీడాకారుల‌ను ఆదుకునేందు తామెన్న‌డూ ముందుంటామ‌ని అసోసియేష‌న్ అధ్య‌క్షులు కేఎన్ఎస్వీ ప్ర‌సాద్ (హారికా ప్ర‌సాద్) వెల్ల‌డించారు. కార్య‌క్ర‌మంలో భాగంగా తొలి రోజు పోటీలను క‌లెక్ట‌ర్ నివాస్ ఆరంభించారు.

రెండ్రోజుల పాటు జ‌రిగే ఈ పోటీల‌కు మీడియా క‌న్వీన‌ర్ గా బ‌హ‌దూర్ బాషా వ్య‌వ‌హ‌రిస్తు న్నార‌ని, అదేవిధంగా క్రీడాకారులకు భోజ‌న‌, వ‌స‌తి ఏర్పాట్ల‌ను త‌మ స‌భ్యులు ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని అసోసియేష‌న్ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ షాజ‌హాన్ తెలిపారు. కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ పాత్రికేయులు కొంక్యాన వేణు, ఎస్జే నాయుడు, వివిధ క్రీడా సంఘాల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

SPORTS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *