కుప్ప కూలిన స్టాక్ మార్కెట్

Stock market that collapsed … రీజన్స్ ఇవే

ఇండియన్ స్టాక్ మార్కెట్ సోమవారం కుప్ప కూలింది. భారీ నష్టాల్లో ట్రేడవుతోంది. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు గ్యాప్‌డౌన్‌తోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ తన మునపటి ముగింపు 38,164 పాయింట్లతో పోలిస్తే 148 పాయింట్ల నష్టంతో 38,016 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 11,456 పాయింట్లతో పోలిస్తే 61 పాయింట్ల నష్టంతో 11,395 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది.
సమయం గడిచేకొద్ది ఇండెక్స్ నష్టాలు మరింత పెరిగాయి. ఉదయం 9:55 సమయంలో సెన్సెక్స్ 372 పాయింట్ల నష్టంతో 37,793 వద్ద, నిఫ్టీ 108 పాయింట్ల నష్టంతో 11,350 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ వడ్డీరేట్లపై పూర్తి మెతక వైఖరి ప్రకటించడం, యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ అంశం మరింత తీవ్రతరం కావడం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళన తదితర అంశాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీన సెంటిమెంట్‌ను నెలకొన్నాయి. దీంతో అమెరికా మార్కెట్లు శుక్రవారం పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆసియా మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దీంతో మన మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది.
నిఫ్టీ 50లో ఐఓసీ, బీపీసీఎల్, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ, హెచ్‌పీసీఎల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐఓసీ 1.5 శాతం మేర పెరిగింది. ముడిచమురు ధరల పతనం ఆయిల్ రంగ షేర్లకు కలిసొచ్చింది.
అదేసమయంలో హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, వేదాంత, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్అండ్‌టీ, ఎంఅండ్ఎం, భారతీ ఇన్‌ఫ్రాటెల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. హిందాల్కో 3 శాతానికిపైగా పడిపోయింది. సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ మెటల్, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లు ఎక్కువగా పడిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *