ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్ .. దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు

Spread the love

Stock Markets Are Bullish Due to the EXIT Poles

ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ కనిపించడంతో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. సోమవారం ఒక్కరోజే సెన్సెక్స్ ఏకంగా 850 పాయింట్లు దూసుకెళ్లింది. నిఫ్టీ కూడా 250 పాయింట్లు దాటడం విశేషం. ఆదివారం సాయంత్రం లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. దాదాపు అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీఏదే పైచేయి కనిపించింది. 2014 ఫలితాలతో పోలిస్తే సీట్లు కాస్త తగ్గినా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్పష్టమైన మెజార్టీ ఎన్డీఏకు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యూపీఏ మ్యాజిక్ మార్క్‌కు దరిదాపులో కూడా లేకపోవడంతో ఇక ఫలితాలు ఎన్డీఏకు అనుకూలంగా వెలువడతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో కొన్ని రోజులుగా నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు సోమవారం ఒక్కసారిగా కోలుకోవడం విశేషం.

వాస్తవానికి ఆరో దశ పోలింగ్ ముగిసిన తర్వాత రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోవడం, మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవన్న వాదనలు వినిపించడంతో స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టపోయాయి. కానీ ఏడో దశ పోలింగ్ ముగిశాక వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆ అంచనాలను తలకిందులు చేశాయి. దీంతో సోమవారం ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 770 పాయింట్ల లాభంతో ఓపెన్ అయింది. కొన్ని నిమిషాల్లోనే 850 పాయింట్లు దాటింది. నిఫ్టీ కూడా 250 పాయింట్లు లాభపడింది. ప్రస్తుతం సెన్సెక్స్ 38,800 పాయింట్లు దాటగా, నిఫ్టీ 11,670 పాయింట్లు దాటింది. 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజున స్టాక్ మార్కెట్లు దాదాపు ఇలాంటి లాభాలనే చూశాయని మార్కెట్ పండితులు విశ్లేషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *