జగన్ కు కడప నుంచే తాజా తలనొప్పి?

Stop Uranium Mining, If Not We'll Commit Suicide

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సొంత జిల్లా ప్రజల నుంచే వ్యతిరేకత ఎదురౌతోంది. అదేంటి? కడప వాసులకు జగన్ అంటే ప్రేమాభిమానాలు ఎక్కువ కదా? అని అంటారు. జగన్ మీద ప్రేమ తక్కువ కానప్పటికీ, తమ గ్రామంలో యూరేనియం తవ్వకాల్ని నిలిపివేయాలని పెద్ద ఎత్తున ఆందోళన మాత్రం చేస్తున్నారు.

తుమ్మలపల్లిలో ఏర్పాటు చేసిన యురేనియం శుద్ధి ప్లాంట్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ప్రభుత్వ తీరుపై  ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యురేనియం తవ్వకాలను తక్షణమే నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యం అంటూ ఆ ప్రజలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కడప జిల్లా తుమ్మలపల్లి గ్రామా ప్రజలు యూరేనియం వెలికితీత సంబంధిత చర్యల వలన వ్యాధుల భారిన పడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. భూగర్బ జలాలు కలుషితం అవుతున్నాయని, రేడియేషన్ వలన చర్మ సంబంధిత వ్యాధులు వచ్చి పొడి బారి, రాలుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేసారు. పశు సంపద, పంటలు నాశనమయ్యాయి అని, మా బాధలు తెలియాలంటే యూసీఐఎల్ అధికారులను ఒక పది రోజులు గ్రామాల్లో ఉండాల్సిందిగా కోరారు. ఈ ఇబ్బంది లేకపోతే తామే గ్రామాలని వొదిలి వెళ్తామని తెలిపారు. అల్యూమినియం పాత్రలో నీరు పోసి 25 రోజులు ఉంచితే వాటికీ చిల్లులు పడుతున్నాయని,అలాంటిది తమ శరీరాలు ఎలా తట్టుకోగలవ్ అని అన్నారు. ప్లాంట్ ఏర్పాటు చేసినపుడు పరిసర ప్రాంతంలో 12 లక్షల మొక్కలు నాటుతామని అన్నారు, కనీసం 10 వేలు కూడా నాటలేదు అని అన్నారు. మాకు న్యాయం జరగకపోతే సీఎం జగన్ ఇంటి వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని అన్నారు. అన్ని సమస్యలను పట్టించుకొనే జగన్ మరి ఈ సమస్యని ఎందుకు పట్టించుకోవడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

tags: uranium, kadppa tummalapalli villagers protest, victims, suicide warnings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *