ప్రభాస్ వస్తే దిగుతా .. లేకుంటే దూకుతా అంటూ సెల్ టవర్ ఎక్కిన యువకుడు 

Student Suicide attempt for Prabhas

జనగామ జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నానా హంగామా  చేస్తున్నాడు. ప్రభాస్ వస్తేనే  దిగుతానని తేల్చి చెబుతున్నాడు. మహబూబాబాద్ కు చెందిన గుగులోతు వెంకన్న అనే వ్యక్తి జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఉడుముల హాస్పిటల్ సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి నానా హంగామా సృష్టిస్తున్నాడు.
సినీ తారలకు పెద్దసంఖ్యలో అభిమానులు ఉంటారు. తమ అభిమాన తారను చూసేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఇలా మాత్రం ఎవరూ ప్రవర్తించరు. ఇక అందరూ విస్తుపోయే ఈ ఘటన జనగామలో చోటుచేసుకుంది. యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కోసం ఓ యువకుడు ఏకంగా సెల్‌ టవర్‌ ఎక్కాడు. అత్యంత ప్రమాదకరంగా సెల్‌ టవర్‌ అంచు మీద నిలబడి.. ప్రభాస్‌ వస్తేనే టవర్‌ దిగుతానని, లేకపోతే దూకి చస్తానని బెదిరిస్తున్నాడు.
జనగామ జిల్లా యశ్వంత్‌పుర పెట్రోల్‌ బంక్‌ పక్కన ఉన్న రిలయన్స్‌ సెల్‌ టవర్‌పైకి గుగులోతు వెంకన్న అనే యువకుడు ఎక్కాడు.  అతడు ప్రభాస్‌ అభిమాని అని తెలుస్తోంది. ప్రభాస్‌ అంటే ఇష్టమని, ప్రభాస్‌ను చూడాలని ఉందని సెల్‌ టవర్‌పైకి ఎక్కిన వెంకన్న డిమాండ్‌ చేస్తున్నాడు. తనను చూసేందుకు, కలిసేందుకు ప్రభాస్‌ రాకపోతే సెల్‌ టవర్‌ దూకేస్తానని అతను బెదిరిస్తున్నాడు. ఇదేమీ విడ్డూరమని విస్తుపోతున్న స్థానికులు.. యువకుడిని బతిమాలి కిందికి దించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

JOGU RAMANNA'S WIFE IS SADDEN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *