ఇంటర్ రీ వాల్యువేషన్ కోసం విద్యార్థుల పాట్లు

Students facing for Inter Revaluations

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలు చోటు చేసుకున్న నేపధ్యంలో రీవాల్యూయేషన్‌కు ఏప్రిల్ 25 వ తేదీ చివరి తేదిగా నిర్ణయించింది ఇంటర్మీడియట్ బోర్డు. కానీ, రీ వాల్యూయేషన్‌ కోసం ధరఖాస్తు చేసుకొనేందుకు వెబ్‌సైట్లు పనిచేయడం లేదు.ఇంటర్ పరీక్షల్లో అవతకవకలు చోటు చేసుకొన్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలను ఇంటర్ బోర్డు ఖండించింది. మంగళవారం నాడు కూడ ఇంటర్ బోర్డు వద్దకు వందల సంఖ్యలో విద్యార్థులు , తల్లిదండ్రులు చేరుకొన్నారు. కానీ, వారిని ఇంటర్ బోర్డు కార్యాలయంలోకి పోలీసులు అనుమతించలేదు.
రీ వాల్యూయేషన్ కోసం ధరఖాస్తు చేసుకొనేందుకుగాను ఆన్‌లైన్ పోర్టల్స్ పనిచేయడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. ఈ నెల 18వ తేదీ నుండి రీవాల్యూయేషన్ కోసం ఆన్‌లైన్ లో విద్యార్థులు ధరఖాస్తు చేసుకొనే వెసులుబాటును ఇంటర్ బోర్డు కల్పించింది. ఈ నెల 22వ తేదీ వరకు సుమారు 4 వేల మంది మాత్రమే రీ వాల్యుయేషన్ కోసం ధరఖాస్తులు వచ్చాయి.ఇంటర్ బోర్డు పోర్టల్ సరిగా పనిచేయడం లేదని పలు ఫిర్యాదులు వచ్చాయి. ఈ నెల 25 వ తేదీ వరకు మాత్రమే ఆన్‌లైన్‌లో ధరఖాస్తులు చేసుకొనేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది.
వేలాది మంది విద్యార్థులు తమ ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే రీ వాల్యూయేషన్ ను కోరుకొంటున్నారు. అయితే ఇంటర్ బోర్డు పోర్టల్ పనిచేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

Related posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *