Sudhakar sensational comments on Mavoist Party
ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మావోయిస్టు పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీలో మంచి వాతావరణం లేదని, మావోయిస్టు సిద్ధాంతాలను పక్కన పెట్టి పార్టీలో కొందరు ప్రవర్తిస్తున్నారని, అది తనకు నచ్చలేదని అందుకే పార్టీని వీడి బయటకు వచ్చానని సుధాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మావోయిస్టు పార్టీలో చోటుచేసుకొన్న ఇబ్బందికర పరిస్థితుల కారణంగా లొంగిపోయినట్టుగా ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ చెప్పారు. పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఘటనల విషయంలో పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తాను అనేక కమిటీల్లో ఈ విషయాలను చర్చించినట్టు ఆయన చెప్పారు.తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన తర్వాత బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలో ఉంటూ బయటకు వెళ్లే సమయంలో ఆయుధాలను, నిధులను నేతలు తీసుకెళ్లే సమయంలో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదన్నారు.
పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆచరణ ఉన్న నేపథ్యంలో ఈ విషయాలను అన్ని కమిటీల్లో చర్చించామన్నారు. కానీ, ఈ విషయాలపై తాను ఏమీ చేయలేనని భావించి తాను లొంగిపోవాలని నిర్ణయం తీసుకొన్నట్టు సుధాకర్ తెలిపారు.
For More Click Here