ప్రగతి భవన్ వద్ద పెట్రోల్ తో హల్ చల్ చేసిన వ్యక్తి అరెస్ట్

suicide attempt at pragathi bhavan

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్ వద్ద పెట్రోల్ తో ఒక వ్యక్తి హల్ చల్ చేశారు. దీంతో అధికార నివాసం ప్రగతి భవన్ వద్ద కలకలం చోటు చేసుకుంది. అసలింతకీ పెట్రోల్ తో హంగామా చేసిన వ్యక్తి ఎందుకు సీఎం కేసీఆర్ నివాసం వద్ద చేసుకోవాలనుకున్నాడు అంటే..

35 ఏళ్ల అచ్చయ్య అనే తాపీ మేస్త్రి సోమాజిగూడ మంజీరా గెస్ట్ హౌస్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. అతనికి ఆరుగురు సంతానం. వారిని పోషించడం చాలా కష్టంగా ఉండటంతో పాటు, భార్య రోజు తిడుతూ వేధిస్తోందని ఆవేదన చెందిన అచ్చయ్య ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే అందుకు సీఎం కేసీఆర్ అధికార నివాసమైన ప్రగతి భవన్ ను ఎంచుకున్నాడు. ప్రగతి భవన్ ముందు పెట్రోల్ పోసుకొని భార్య బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు అచ్చయ్య . దీంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ అతనిపై నీళ్లు గుమ్మరించి, అతను ఆత్మహత్యా ప్రయత్నాన్ని ఆపారు. తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అచ్చయ్య ను అరెస్ట్ చేశారు. అచ్చయ్య భార్యను కూడా తీసుకొచ్చి భార్యాభర్తలకు ఇద్దరికి కౌన్సిలింగ్ నిర్వహించి పంపించేశారు.

suicide attempt at pragathi bhavan,police foil man suicide,KCR Pragathi Bhawan,Pragathi Bhavan News,Acchaiah,Telangana News,CM KCR,Petrol

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *