చంద్రబాబు నిర్ణయం తప్పని చెప్పినా..

Spread the love

Sujana Chowdhury has not heard Chandrababu’s decision wrong

ఎన్నికల ముందు అసలు ఉనికే లేని కాంగ్రెస్ తో సఖ్యతగా ఉండటం అదే సమయంలో ఏపీలో పెద్దగా ఉనికిలో లేని బీజేపీతో యుద్ధం చేయడం.. ఈ రెండూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన పొరపాట్లు అని అంటున్నారట ఆ పార్టీ ఎంపీ సుజనా చౌదరి! ఈ విషయంలో తమబోటి వాళ్లు చెప్పినా చంద్రబాబు నాయుడు వినలేదని చౌదరి అంటున్నారని సమాచారం.
2014 ఎన్నికల్లో బీజేపీ, పవన్ కళ్యాణ్ సహాయంతో తాము అధికారంలోకి వచ్చినట్టుగా చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను దూరం చేసుకొన్నామన్నారు. బీజేపీని రాష్ట్రంలో దెబ్బతినేందుకు తమ పార్టీ కారణమైందన్నారు. కానీ, అదే సమయంలో తమ పార్టీ కూడ అధికారానికి దూరమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఏపీలో బలహీనమైన పార్టీని లక్ష్యంగా చేసుకోవడం వల్ల రాజకీయంగా నష్టపోయామని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడు లెక్కలు ఎక్కడో తప్పాయని ఆయన అభిప్రాయపడ్డారు.2014 లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గుడ్ గవర్నెన్స్ ఇవ్వలేకపోయినట్టుగా సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. గతంతో పోలిస్తే గవర్నెన్స్ విషయంలో అనేక పొరపాట్లు చోటు చేసుకొన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను తాను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టుగా ఆయన చెప్పారు.

టీడీపీని వీడుతానని తనపై ప్రచారం చేస్తున్నారని… తనకు అలాంటి అవసరం లేదని సుజనాచౌదరి చెప్పారు.ఒకవేళ అదే పరిస్థితి వస్తే ముందుగా ఆ విషయాన్ని చంద్రబాబుకు చెబుతానన్నారు. ఆ తర్వాత మీడియాకు కూడ ఈ విషయమై స్పష్టత ఇవ్వనున్నట్టు సుజనా తేల్చి చెప్పారు.ప్రత్యేక హోదా విషయంలో పిల్లి మొగ్గలు వేయడం కూడ తమకు నష్టం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కేంద్రం నుండి రాబట్టాల్సిన నిధుల విషయంలో వెనక్కు వెళ్లలేదన్నారు. రాష్ట్రానికి దక్కాల్సిన నిధులను రాబట్టుకొనేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశామన్నారు.
2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు కోటరీలో తాను ఉండేవాడినని సుజనా చౌదరి చెప్పారు. అయితే ఎన్నికల తర్వాత తాను కేంద్ర మంత్రి పదవి రావడంతో ఎక్కువగా ఢిల్లీకే పరిమితం కావాల్సి వచ్చిందన్నారు. 2014-19 మధ్యలో తాను చంద్రబాబు కోటరీలో లేనని చెప్పారు.

మనుషులతో కంటే… మిషన్లు చెప్పే మాటలను చంద్రబాబునాయుడు నమ్మారని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. సర్వేల మీద ఆధారపడ్డారన్నారు. పాలనపై కేంద్రీకరించి….. పార్టీని పట్టించుకోలేదన్నారు. ఈ కారణాలతోనే పార్టీ ఈ ఎన్నికల్లో ఓటమిని మూట గట్టుకొందని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు.మంగళగిరి నుండి పోటీ చేయడం లోకేష్ చేసిన తప్పు అని సుజనా చెప్పారు. ఈ నియోజకవర్గంలో బీసీ ఓటింగ్ ఎక్కువగా ఉంటుందన్నారు. గత ఐదేళ్లలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ నియోజకవర్గం కాకుండా మరో నియోజకవర్గం నుండి లోకేష్ పోటీ చేస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.నెగెటివ్ ఓటింగ్ ఆధారంగానే ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైందని సుజనా చెప్పారు. గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబునాయుడును తనిఖీ చేసిన సమయంలో తాను కూడ అక్కడే ఉన్నానని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఇలా చేయడంలో తప్పేమీ లేదన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *