చిరంజీవి దర్శకుడిపై తప్పుడు ప్రచారం ..?

2
sujeeth movie update
sujeeth movie update

sujeeth movie update

ఇదుగో రూమర్ అంటే అదుగో వార్త అనే రకం బ్యాచ్ లు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సినిమావాళ్లకు సంబంధించి నిత్యం ఏదో ఒక అసత్య వార్త రాస్తూ పరిశ్రమ ప్రముఖులతో చీవాట్లు తినే వెబ్ సైట్స్ కు లెక్కలేదు. ఇక లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి దర్శకుడిపై పడ్డారు వాళ్లు. శర్వానంద్ హీరోగా రన్ రాజా రన్ అనే సినిమాతో దర్శకుడుగా కెరీర్ మొదలుపెట్టిన సుజిత్.. రెండో సినిమాకే 150కోట్ల బడ్జెట్ ఉన్న సాహో సినిమాను హ్యాండిల్ చేసి సత్తా చాటాడు. కంటెంట్ పరంగా కాస్త అటూ ఇటైనా.. అతని వయసుకు చేసిన డేర్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సాహో తర్వాత ఏం చేస్తాడా అనుకుంటోన్న టైమ్ లో అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఆఫర్ ఇచ్చాడు. మళయాలంలో మోహన్ లాల్ హీరోగా నటించిన లూసీఫర్ రీమేక్ ను తెరకెక్కించే బాధ్యతను సుజిత్ కు ఇచ్చాడు చిరంజీవి. ఆల్రెడీ తెలుగులోనూ డబ్ అయిన ఈ మూవీని మళ్లీ రీమేక్ చేయడం అంటే స్క్రిప్ట్ మీద సామే. అయినా సుజిత్ ఆ పనిలో సక్సెస్ ఫుల్ గా ఉన్నాడు. ఈ మధ్య తను పెళ్లి చేసుకున్నాడు. దీంతో కొంత గ్యాప్ వచ్చింది. దీంతో ఇక ఈ ప్రాజెక్ట్ నుంచి సుజిత్ ను తప్పించారు అంటూ వార్తలు వస్తున్నాయి.

కానీ లూసీఫర్ రీమేక్ నుంచి సుజిత్ తప్పుకున్న మాట అవాస్తవం అంటోంది మెగా టీమ్. అసలు తమకు వేరే దర్శకుడిని తీసుకోవాలన్న ఆలోచనే లేదనేది మెగాక్యాంప్ నుంచి స్పష్టంగా వినిపిస్తోన్న విషయం. అయితే దీనికి యూవీ క్రియేషన్స్ ను లింక్ చేస్తూ.. వార్తను వండారు. యూవీ క్రియేషన్స్ లో  గోపీచంద్ హీరోగా ఓ సినిమా ఉంది. ఆ సినిమాకు సుజిత్ ను తీసుకున్నారు అని.. అందుకే అతను లూసీఫర్ నుంచి తప్పుకున్నాడు అన్నారు. కానీ అందులో నిజం లేదట. గోపీచంద్ సినిమాను మారుతి డైరెక్ట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. పైగా మారుతి కూడా ఈ మధ్యే గోపీచంద్ ఇమేజ్ కు సరిపోయే కథ రెడీ చేసుకున్నాడు. ఈ ఇద్దరూ కలిసి యూవీ క్రియేషన్స్ లో సినిమా చేస్తారు అనే న్యూస్ కూడా వచ్చాయి. మరి ఈ ప్రాజెక్ట్ లోకి సుజిత్ ఎలా ఎంటర్ అవుతాడు అనేది ప్రశ్న. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీలో ఏదైనా జరగొచ్చు. ఇదుగో ఇలా ఇంట్లో కూర్చుని దర్శకుణ్ని తీసేశారు అనే రాతలతో సహా.

tollywood news