క్రేజీ కాంబినేషన్

6
Sukumar direct to Vijay devarakonda
Sukumar direct to Vijay devarakonda

Sukumar direct to Vijay devarakonda

యువ హీరోల్లో విజయ్ దేవరకొండ స్టయిల్ వేరు. ఇక డైరెక్టర్లలో సుకుమార్‌ది ఓ ప్రత్యేకమైన శైలి. మరి అలాంటి ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది. అభిమానులకు పండుగే కదా. అవును ఈ క్రేజీ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోంది. “నాలో నటుడు ఎగ్జయింట్‌గా వెయిట్‌ చేస్తున్నాడు. నాలోని ప్రేక్షకుడు సెలబ్రేట్‌ చేసుకుంటున్నాడు. మీ అందరికీ గుర్తుండిపోయే సినిమాను ఇస్తామని గ్యారంటీ ఇస్తున్నా. సుక్కుగారిని సెట్ లో ఎప్పుడెప్పుడు కలుద్దామా! అని ఎదురుచూస్తున్నాను. ఎంతో హార్డ్‌ వర్క్‌ చేస్తావు” అంటూ విజయ్‌ దేవరకొండ ట్వీట్‌ చేశారు.

కేదార్‌ సెలగం శెట్టి ఫాల్కన్‌ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఈ పుట్టిన రోజు నాకు చాలా స్పెషల్. నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తులు విజయ్ దేవరకొండ, సుకుమార్‌గారి. ఈ సినిమా 2022 లో మొదలు కాబోతుంది. పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ సినిమా ఉండబోతుంది. విజయ్ ,సుకుమార్..ఇద్దరూ కొత్తదనాన్ని బాగా ఇష్టపడతారు. వాళ్ళిద్దరి కలయిక లో వస్తున్న ఈ సినిమా కూడా వాళ్ళ స్టైల్ లోనే ఉంటుంది” అని అన్నారు.