పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన హీరో సుమన్ …

Suman Fires On Pawan Kalyan Over Disha

డాక్టర్ దిశా ఘటన దేశవ్యాపంగా బాధకు గురి చేసింది. వెటర్నరీ డాక్టర్ గా పనిచేస్తున్న దిశను నలుగురు దుర్మార్గులు అత్యాచారం చేసి హత్య చేశారు. దీంతో యావత్ భారతం ఉలిక్కిపడింది. అతి దారుణంగా అత్యాచారం చేసి పెట్రోల్ పోసి బ్రతికుండగానే ఆమెను చంపేశారు కీచకులు. దీంతో ప్రజలందరూ ఘటనపై స్పందించిన తీరు అభినందనీయం. ముఖ్యంగా యువత రోడ్లపైకి వచ్చి జస్టీస్ ఫర్ దిశా అంటూ నినాదాలతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక తీసుకొచ్చింది. అయితే దిశా ఘటనపై అందరు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంటే ఓ నాయకుడు మాత్రం వాళ్ళను ఉరి తియ్యడం ఎందుకు రెండు బెత్తం దెబ్బలు వేస్తే సరిపోతుందంటూ పనికిమాలిని చిల్లర వ్యాఖ్యలు చేశాడు. ఆయనే పార్టీ అధినేతగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్. దీంతో అయన గారి వ్యాఖ్యలపై ప్రజలు విరుచుకుపడుతున్నారు. ఇక ప్రముఖులు సైతం పవన్ కళ్యాణ్ మాటలను తప్పుబడుతున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ పై అలనాటి టాప్ హీరో సుమన్ స్పందించారు. అయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మాటలను ఖండించారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే శిక్షించాల్సింది పోయి బెత్తంతో కొట్టడమనడం సిగ్గుచేటంటూ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఇంట్లోనే మహిళలకు ఇలాంటి ఘటన జరిగితే బెత్తంతో కొట్టమంటాడా అని ప్రశ్నించిన సుమన్ బాధితుల ఆవేదనను అర్థం చేసుకుని మాట్లాడాలని పవన్‌కు హితవు పలికారు. అదే విధంగా అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Suman Fires On Pawan Kalyan Over Disha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *