సుమంత్ కూడా బరిలో ఉన్నా అంటున్నాడు.. 

Sumanth ready with movie
అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన నటుడు సుమంత్. తొలినాళ్లలో అతనిపై మంచి అంచనాలు ఉండేవి. పైగా అక్కినేని నాగేశ్వరరావుకు ముద్దుల మనవడుగానూ పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో తాతతో కలిసి ఓ సినిమా.. మేనమామ నాగార్జునతో కలిసి మరో సినిమా చేసినా అదృష్టం దక్కలేదు. మొత్తంగా నాగార్జున తర్వాత మంచి హీరో అవుతాడు అనుకుంటే అతను ఆ రేంజ్ కు వెళ్లలేకపోయాడు. ఏవో నాలుగైదు హిట్లు తప్ప కెరీర్ అంతా డల్ గానే ఉంది. ఇక రీసెంట్ గా సుబ్రహ్మణ్యపురం అంటూ మరో విజయం(..?) అందుకున్న సుమంత్.. తాజాగా ఓ కన్నడ సినిమా రీమేక్ తో రాబోతున్నాడు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిర్మించిన సినిమా ‘కవలుదారి’. హేమంత్ రావు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రిషి హీరోగా నటించాడు. అనంత్ నాగ్ ఓ కీలక పాత్ర చేశాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా సూపర్ హిట్ అందుకున్న ఈ కవలుదారినే తెలుగులో సుమంత్ ‘కపటధారి’గా రీమేక్ చేస్తున్నాడు. గతంలో తమిళ్ హీరో బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ హీరోగా భేతాళుడు అనే ఫ్లాప్ సినిమా తీసిన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ రీమేక్ ను హ్యాండిల్ చేస్తున్నాడు. ఇక హీరోయిన్ కు పెద్దగా ఆస్కారం లేని ఈ మూవీలో నందిత శ్వేత ఫీమేల్ లీడ్ చేస్తోంది. తెలుగులో అనంత్ నాగ్ పాత్రను నాజర్ తో చేయిస్తున్నారు.
ఇక లేటెస్ట్ గా ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని ట్వీట్ చేశాడు సుమంత్. అయితే లాక్ డౌన్ అనౌన్స్ కావడానికి ముందే కపటధారి షూటింగ్ అయిపోయిందట. కానీ అప్పుడు అనౌన్స్  చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం పోస్ట్ ప్రొడక్షన్ కు పర్మిషన్ ఇవ్వడంతో ఆ పనులు మొదలయ్యాయని చెబుతూ ట్వీట్ చేశాడు సుమంత్. అంటే థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత తానూ రేస్ లో ఉన్నానని చెప్పకనే చెప్పాడన్నమాట. ఇక సినిమా విషయానికి వస్తే ఇదో మర్డర్ మిస్టరీ. కానీ దాదాపు నలభైయేళ్ల క్రితం జరిగిన మర్డర్ ను ఈ కాలంలో కనిపెడతాడు హీరో. కానీ అతను ట్రాఫిక్ పోలీస్. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కు పర్మిషన్ ఉండదు. ఎప్పటికైనా సివిల్ డిపార్ట్ మెంట్ లో రావాలని.. ఓ మాజీ పోలీస్ అధికారితో కలిసి ఈ నేరస్తున్ని కనిపెడతాడు. కానీ అతను అప్పటికే పేరు మోసిన ధనవంతుడు అయి ఉంటాడు. అయితే సాధారణ క్రైమ్ డ్రామాస్ కు బిన్నంగా నేటి కాలానికి 1970ల కాలానికి ముడిపెడుతూ సాగే ఈ కథ అద్భుతంగానే ఉంటుందని చెప్పాలి. మరి తెలుగులో ఎక్కువ మార్పులు చేయకుండా ఉంటే ఇక్కడా ఆకట్టుకునే ఈ కథకు పుష్కలంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *