సునీల్ కు ఆ ఇమేజ్ శాపంలా మారిందా..?

2
Is sunil fate changed?
Is sunil fate changed?

తెలుగులో బ్రహ్మానందం తర్వాత ఆ స్థాయిలో ఇమేజ్, క్రేజ్ ఉన్న కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు సునీల్. ఎన్నో సినిమాలు అతని హాస్యమే ప్రధాన బలంగా విజయం సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి తను తన ఇమేజ్ కు తగ్గ కథతోనే అందాలరాముడు అంటూ ఆడియన్స్ ముందుకు హీరోలా వచ్చాడు. కంటెంట్ కూడా బానే ఉంది. అందుకే అందాల రాముడు ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆ మోజులో పడిపోయాడు. రాజమౌళి నుంచి ఆఫర్ రాగానే పర్సనాలిటీ కూడా తగ్గించుకుని మరీ రెడీ అయ్యాడు. మర్యాద రామన్న కూడా సూపర్ హిట్ కావడం, ఆ వెంటనే అహ నా పెళ్లంటా విజయం సాధించడంతో ఇక కామెడీకి రాంరాం అనేశాడు. హీరోగా హ్యాట్రిక్ విజయాలున్నాయి సునిల్ కు. కానీ ఆ తర్వాతే మొదలయ్యాయి కష్టాలు. అటుపై తడాఖా తప్ప మరో హిట్ పడలేదు. చాలాకాలం పాటు ప్రయత్నించి ఫైనల్ గా ఇక హీరోగా చేయడం కష్టం అనుకుని మళ్లీ త్రివిక్రమ్ నుంచి కమెడియన్ గా టర్న్ అయ్యాడు. బట్.. ఈ టర్న్ అతనికి మల్లీ కమెడియన్ గా కొత్త టర్నింగ్ కాలేకపోతోంది. పైగా ఇప్పుడు సునిల్ మార్క్ హాస్యానికి పెద్దగా ప్లేస్ లేదు. ట్రెండ్ మారింది.

ఆ ట్రెండ్ కు తగ్గ వెర్సటాలిటీ అతనిలో ఉందా అంటే అవును అని ఖచ్చితంగా చెప్పగలిగే సినిమాలు అతని ఖాతాలో లేవు. ఆ ఖాతా తెరుస్తూనే ఇప్పుడు సరికొత్త పాత్రలకు సిద్ధం అవుతున్నాడు. సునిల్ మళ్లీ కమెడియన్ గా రాణించడం దాదాపు కష్టం. ఉన్నా.. ఆ ఇమేజ్ ను కంటిన్యూ  చేయడం అంత సులువు కాదు. అందుకే ఏ పాత్రైనా ఓకే అంటూ తనలోని కొత్త కోణాలను ఆవిష్కరించబోతున్నాడు. ఈ క్రమంలో అతను కలర్ ఫోటో అనే సినిమాలో రామరాజు అనే పోలీస్ పాత్ర చేస్తున్నాడు. రీసెంట్ గా విడుదలైన ఈ టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే సునిల్ పాత్రను చూస్తే అతను విలన్ గా కనిపించబోతున్నాడు అని అర్థమౌతోంది. అంటే కమెడియన్ కాస్తా విలన్ అయ్యాడన్నమాట. నిజానికి తను విలన్ గా నటించాలనే పరిశ్రమకు వచ్చానని చాలాసార్లు చెప్పాడు. ఇన్నాళ్లకు అది నిజమైంది. మరి ఈ పాత్రలో సునీల్ ను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి.

tollywood news