Supar star Mahessh work with tivikram
మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ఒక రకమైన క్రేజ్. వీరిద్దరి కలాయికలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. అతడు బ్లాక్ బాస్టర్ హిట్ కాగా, ఖలేజా పర్వాలేదనిపించుకుంది. ఖలేజా తర్వాత ఈ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. మహేశ్ అభిమానులు కాకుండా, టాలీవుడ్ కూడా వీరిద్దరి నుంచి మరో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే అతి త్వరలో త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందని మహేశ్ ప్రకటించాడు.
ఖలేజా మూవీ రిలీజై పది సంవత్సరాలు కావస్తోంది. ఈ చిత్రం నాకు ప్రత్యేకమని, నటుడిగా నన్ను నేను నిరూపించుకోవడానికి హెల్ప్ అయిందన్నారు మహేశ్. అయితే మహేశ్ ప్రస్తుతం సర్కారువారి పాట, ఆ తర్వాత రాజమౌళితో మరో సినిమా చేయనున్నాడు. ఈ రెండు పూర్తయ్యాకా మహేశ్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడేమో…