శభాష్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి

Super Mayor Venkat Reddy

ప్రజాప్రతినిధి అంటే ఇలాగుండాలి.. ప్రజలకు ఎలాంటి సమస్యలొచ్చినా వాటిని ముందుండి పరిష్కరించాలి.. ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నానంటూ భరోసా కల్పించాలి. మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సంపూర్ణ భరోసా కల్పించారు. స్వయంగా తనే రంగంలోకి దిగి.. తాను నోటిమాటల రాజకీయనాయకుడిని కాదని మరోసారి నిరూపించారు. అందుకు ఈ ఫోటోనే నిదర్శనం. ఇంతవరకూ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఏ మేయరూ ఈ స్థాయిలో ప్రజలకు సాయం చేసింది లేదని ఘంటాపథంగా చెప్పొచ్చు. జక్కా వెంకట్ రెడ్డి సేవాతత్పరతను గుర్తించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ జక్కా వెంకట్ రెడ్డిని ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావితంతో గత రెండు రోజుల నుండి ఎడతెరపు లేకుండా కురుస్తున్నా వర్షాలతో ఎగువన ఉన్న చెరువులు తెగి పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెరువులలోకి చేరడంతో కార్పొరేషన్ పరిధిలోని రెండు చెరువులు గూడెం చెరువు, పర్వతాపూర్ చెరువు తెగి చెరువుల క్రింద ఉన్న రామకృష్ణ నగర్, కృష్ణా నగర్, బాలాజీ నగర్, ఆదర్శ నగర్, సాయి కృష్ణ నగర్, వెంకట సాయి నగర్, విష్ణు పూరి కాలనీ, శ్రీపాద ఏంక్లావ్, రాం నగర్, మల్లికార్జున నగర్, శబరి గార్డెన్ చుట్టుపక్కల కాలనీలు అన్ని జలమైయమయ్యాయి. చెంగిచెర్ల చెరువు నుండి వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో లోతట్టు కాలనీలు ప్రగతి నగర్, సుమ రెసిడెన్సీ, కాకతీయ నగర్, పంచవటి కాలనీ, విహరిక మొదలైన కాలనీలు అన్ని జలమైయమయ్యాయి.

అపార్టుమెంట్ల సెల్లార్లలోకి వరద నీరు చేరడంతో అపార్టుమెంట్లలో నివాసం ఉంటున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వరంగల్ జాతీయ రహదారిపై వర్షం నీటి ప్రవాహంతో వాహన దారులకు చాలా ఇబ్బందిగా మారడంతో రాత్రి నుండి మేయర్ జక్కా  వెంకట్ రెడ్డి లోతట్టు ప్రాంతాలలో తిరుగుతూ, డిప్యూటి మేయర్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులతో కలిసి వివిధ డివిజన్లలో పరివేక్షించారు, కార్పొరేటర్లు వారి వారి వార్డులో తిరుగుతూ పరిస్థితులను అంచనా వేసి కాలనీ వాసులకు ధైర్యాన్ని ఇచ్చారు, వారి ద్వారా పరిస్థితుల గురించి ఎప్పటికి అప్పుడు తెలుసుకొని రెస్క్యూ టీంతో సాధ్యమైనంత వరకు ప్రజలకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. తీవ్ర రూపం దాల్చిన వరద సమస్యను ఎప్పటికప్పుడు మేయర్ సమీక్షిస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

ఉదయం కమిషనర్ మరియు అధికారులతో చర్చించి జేసీబీలను తెపించి అవసరమైన చోట వాటితో వరద నీటిని మళ్లించనైనది, వరంగల్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున కాలువలు తీసి సాధ్యమైనంత మేరకు వరదను రోడ్డు పై నుండి మళ్లించనైనది, అనంతరం బోట్ లను ఏర్పాటు చేసి వాటి సహాయంతో వరుదలలో చిక్కుకున్న వారికి అల్పాహారాన్ని మరియు మధ్యాహ్నం భోజనం అందించారు, లోతట్టు ప్రాంతాలు సందర్శిస్తూ వరద నీరు ఇంట్లోకి చేరిన కాలనీ వాసులని తాడు సహతో మేయర్ స్వయంగా వరుదలలోకి దిగి తీసుకువచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎవరుకూడా అధైర్యపడకుండా అప్రమతంగా ఉండాలని వరుద తగ్గే వరకు ఈ సహాయక చర్యలు కొనసాగుతాయని వివిధ డివిజన్లలో పర్యటిస్తు కాలనీ వాసులకు ధైర్యం చెప్పారు. అనంతరం భారీ వర్షాలకు ముంప్పునకు గురైన పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్ లో గౌరవ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మాలిపెద్ది శరత్ చంద్రా రెడ్డి, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పర్యటించి వరుదల గురించి అడిగి తెలుసుకున్నారు, గండి పడిన చెరువులను పరిశీలించి ప్రజలకు ధైర్యాన్ని నింపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *