ఢిల్లీకి సూపర్ గెలుపు

SUPER WIN FOR DELHI

  • సూపర్ ఓవర్లో కోల్ కతాపై విజయం

సులభంగా గెలిచే మ్యాచ్ ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సూపర్ ఓవర్ వరకు తెచ్చుకుంది. సూపర్ ఓవర్లో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం ఖాయమనుకున్నప్పటికీ, రబడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ విజయం సాధించి, ఊపిరి పీల్చుకుంది. ఢిల్లీలో శనివారం జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ విజయం వైపు సాగుతూ చివర్లో అనూహ్యంగా బోల్తా పడింది. గెలిచేందుకు 14 బంతుల్లో 16 పరుగులు కావాల్సిన తరుణంలో మ్యాచ్ మొగ్గు మారిపోయింది. 99 పరుగుల వద్ద పృథ్వీ ఔట్ కావడంతో పరిస్థితి మారిపోయింది. 6 బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా.. కుల్దీప్‌ తొలి నాలుగు బంతుల్లో 4 పరుగులిచ్చాడు. తర్వాత బంతికి విహారి (2) ఔటయ్యాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా, ఇంగ్రామ్‌ తొలి పరుగు పూర్తి చేసి, రెండో పరుగు చేసే లోపే రనౌటయ్యాడు. దీంతో స్కోరు సమం కావడంతో సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేల్చాల్సి వచ్చింది. సూపర్‌ ఓవర్లో ముందుగా ఢిల్లీ 10 పరుగులు చేయగా.. కోల్‌కతా 7 పరుగులకే పరిమితమై ఓటమి చవిచూసింది.

అంతకుముందు మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రసెల్‌ (28 బంతుల్లో 62; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) మళ్లీ రప్ఫాడించగా.. దినేశ్‌ కార్తీక్‌ (36 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రాణించాడు. 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును వీరిద్దరూ కలిసి ఆదుకున్నారు. ఆరో వికెట్ కు 95 పరుగులు జోడించి జట్టు మంచి స్కోర్ చేయడానికి దోహదపడ్డారు. దీంతో కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్‌ ధాటిగా లక్ష్యఛేదనను ప్రారంభించింది. ధావన్‌ (8 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్‌) వికెట్‌ పడినా… ఢిల్లీ బెదరలేదు. పృథ్వీ షా (55 బంతుల్లో 99; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగు తేడాతో సెంచరీ కోల్పోగా, శ్రేయస్‌ అయ్యర్‌ (32 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసి మ్యాచ్ టై చేసింది. అనంతరం సూపర్ ఓవర్లో విజయం సాధించింది.

SPORTS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *