సరైన సమయంలోనే పొలిటికల్ ఎంట్రీ

#Superstar rajanikanth talks about political entry#

ఇతర హీరోలతో పొలిస్తే తమిళ్ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ క్రేజ్ వేరు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడిస్తారా? అని అభిమానులే కాదు, వివిధ పార్టీలే వేచి చూస్తున్నాయి. ఇదే విషయం రజనీని అడిగితే సరైన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమాన సంఘాలతో చర్చించి రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని స్పష్టం చేశారు. ఆయనకు అనారోగ్య సమస్యలు రావడం వల్లే ఆలస్యం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

అయితే ఈ వ్యవహారంపై రజనీకాంత్‌ స్పందించారు. ‘‘నాకు 2016లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ జరిగింది. ఆ ఆపరేషన్‌ చేసిన వైద్యులు.. ఆరోగ్య కారణాల రీత్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని అప్పట్లో నాకు సలహా ఇచ్చారు’’ అని రజనీ తెలిపారు. అయితే, అది వారి సలహా మాత్రమేనని, రాజకీయాల్లో రావాలనే నిర్ణయం నుంచి తాను వెనక్కి పోయేది లేదన్నారు. పొలిటికల్ ఎంట్రీ ఖాయమని, దానికి ఇంకా టైం ఉందని ఆయన తన మనసులోని మాట బయటపెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *