సెక్స్ వర్కర్లకు రేషనివ్వండి

Supreem court orders ration to sex workers

కోవిడ్ వల్ల సామాన్య ప్రజలే కాకుండా, సెక్స్ వర్కర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణకు కొందరు, ఇతర ఉపాధి మార్గాలు లేక మరికొందరు.. సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు.  తాజాగా సుప్రీంకోర్టు సెక్స్ వర్కర్ల సమస్యలపై స్పందిస్తూ వాళ్లకు నెలానెలా చౌక డీపోల ద్వారా రేషన్ ఇవ్వాలని, నగదు బదలాయింపు కూడా చేయాలని రాష్ర్ట ప్రభుత్వాలను ఆదేశించింది.

గుర్తింపు కార్డులు ఏమీ చూపకున్నా.. సెక్స్ వర్కర్లం అని చెప్పిన అందరికీ ‘జాతీయ విపత్తుల సహాయ నిధి’ కింద సాయపడాలని జస్టీస్ లావు నాగేశ్వర్ రావు, జస్టీస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం సూచించింది. దేశవ్యాప్తంగా కరోనా కాలంలో ఉపాధి కోల్సోయిన 9 లక్షలకుపైగా మహిళా, ట్రాన్స్ జెండర్ సెక్స్ వర్కర్లకు ఉపాధి లేకుండా పోయిందని ఓ సంస్థ రిపోర్ట్ లో తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *