అన్నయ్యతో సైరా.. తమ్ముడితో ఏంటి సురేందర్?

4
surender with pawan
surender with pawan

surender with pawan

సురేందర్ రెడ్డి.. టాలీవుడ్ లో స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఈ మధ్యే చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరాతో భారీ హిట్ అందుకున్న సురేందర్ ఆ తర్వాత ఏ హీరోతో చేస్తాడా అనే డౌట్స్ చాలా మందిలో వచ్చాయి. మధ్యలో అక్కినేని అఖిల్ తో సినిమా అనౌన్స్ అయింది. కానీ అది ఆగిపోయింది. మరి తర్వాతేంటీ అన్న ప్రశ్నకు సమాధానంగా పవన్ కళ్యాణ్ బర్త్ డే వేదికగా ఆన్సర్ వచ్చింది. యస్.. పవన్ కళ్యాణ్ ను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయబోతున్నాడు. కొన్ని రోజులుగా సురేందర్ రెడ్డి ఆస్థాన రచయిత వక్కంతం వంశీ కథతో సురేందర్ రెడ్డ సినిమా చేస్తాడు అనే వార్తలు వస్తున్నాయి. ఆ కథ పవన్ కళ్యాణ్ కోసం అని ఇవాళ ఆయన బర్త్ డే సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ అయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్ అయిన కిక్, రేసుగుర్రం సినిమాకలు కథ అందించింది వక్కంతం వంశీయే. ఆ తర్వాత వీరి మధ్య కొన్ని విభేదాలు వచ్చి విడిపోయారు.

కానీ ఇన్నాళ్లకు మళ్లీ పవర్ ప్యాక్ మూవీకి కలిసిపోవడం విశేషం. రామ్ తాళ్లూరి నిర్మించబోతోన్న ఈ సినిమాకు సంబంధించి ఇది ఇన్ డైరెక్ట్ గా అఫీషియల్ అనౌన్స్ మెంట్ అనుకోవచ్చు. అయితే ఇప్పటికే మూడు సినిమాలు లైన్ లో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తాడనేది కన్ఫ్యూజింగ్ గా మారింది. మొత్తంగా పవన్ కళ్యాణ్ దూకుడు మాత్రం మామూలుగా లేదు. ఇప్పటికే వకీల్ సాబ్ ఇంకా షూటింగ్ చేయాల్సి ఉంది. తర్వాత క్రిష్, హరీశ్ శంకర్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. అయినా సురేందర్ రెడ్డితో మూవీకి కమిట్ కావడం విశేషం అనే చెప్పాలి. మరి ఈ మూడు సినిమాల్లో ఏది ముందుగా మొదలవుతుంది. ఏది ముందుగా రిలీజ్ అవుతుందనేది చూడాలి.

tollywood news