విజయారెడ్డి సజీవ దహనం చేసిన సురేష్ మృతి

Spread the love

Suresh died in hospital

తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం కేసులో నిందితుడు సురేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. తహసీల్దార్ విజయారేడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సురేష్ తన మీద కూడా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దాంతో  అతనికి కూడా తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 60 శాతానికి పైగా కాలిన గాయాలు కావడంతో 4 రోజులుగా కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడిన సురేష్‌ చివరికి చనిపోయాడు. ఆరోగ్య పరిస్థితి  విషమించడంతో ఈ ఉదయం నుంచీ వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే చికిత్సకు సురేష్‌ శరీరం సహకరించలేదని సమాచారం. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సురేష్ అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కాలిన గాయాలతో ఉన్న సురేష్‌ ను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బర్న్ షాక్‌లో ఉన్న సురేష్ పరిస్థితి నిన్నటికి మరింత విషమించింది. దీంతో సురేష్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. కొంతకాలంగా భూ పట్టా కోసం తహశీల్దార్ చుట్టూ తిరిగానని సురేష్ తెలిపాడు. విజయారెడ్డి చేసిన అన్యాయం వల్ల తమ కుటుంబం రోడ్డున పడిందనే కారణంగానే ఆమెపై కక్ష పెంచుకున్నానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు.

tags : vijayareddy, burnt alive case, accused, suresh died, condition serious, osmania hospital,death statement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *