విజయారెడ్డిని దహనం చేసిన సురేష్ చనిపోలేదు

Suresh is not dead says RMO

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేశ్‌ ఈ రోజు మృతి చెందాడని వార్తలు వస్తున్నాయి. తాసిల్దార్ విజయ రెడ్డి పై పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటనలో అతడు కూడా తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. అతడికి ఉస్మానియాలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించి అతడు మృతి చెందాడని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఉస్మానియా ఆసుపత్రి ఆరంభం మహమ్మద్ రఫీ వెల్లడించారు. నిన్న రాత్రి నుండి సురేష్ వెంటిలేటర్ పై ఉన్నాడని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వెంటిలేటర్ పై ఉంచామని ఆయన పేర్కొన్నారు . సురేష్ చనిపోలేదని సూపరిండెంట్ నాగేందర్ కూడా ప్రకటించారు.

సురేశ్‌ 65 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చేరగా చికిత్స అందించిన విషయం తెలిసిందే. ఓ భూమికి సంబంధించి పట్టా ఇవ్వలేదనే ఆగ్రహంతోనే తాను ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు సురేశ్‌ వాంగ్మూలం ఇచ్చాడు. అలాగే తనపై తానే పెట్రోల్ పోసుకున్నట్లు చెప్పాడు. ముఖం, ఛాతీ కాలిపోవటంతో అతనికి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. అయితే అతని పరిస్థితి మాత్రం సీరియస్ గా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

tags : vijayareddy, burnt alive case, accused, suresh, condition serious, osmania hospital

రామేశ్వరరావు ఎవరికి ఛాలెంజ్?

విజయారెడ్డి సజీవదహనానికి ప్రభుత్వమే కారణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *