హైదరాబాద్ పై సర్జికల్ స్ట్రైక్?

Surgical Strike On Hyderabad?

హైదరాబాద్ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తారట.. బీజేపీ నాయకులు హోష్ లో ఉండే మాట్లాడుతున్నారా? అని కేటీఆర్ నిలదీశారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది దీన్ని చెడ గొట్టే ప్రయత్నం కోసమే దిగ జారి మాట్లాడుతున్నారన్నారు. ఎవరేం మాట్లాడుతున్నారో ప్రజలే బేరీజు వేసుకోవాలని హితువు పలికారు. పూల బొకే లాంటి హైదరాబాద్ ను విచ్చిన్నం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని.. బీజేపీ కి చెందిన పెద్ద మనిషి పిచ్చిగా మాట్లాడుతున్నారని తెలిపారు. పచ్చగా ఉన్న హైదరాబాద్ లో చిచ్చు పెడుతున్నారని చెప్పారు. నాలుగు ఓట్ల కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండటం ఇదే మొదటి సారి చూస్తున్నానని అన్నారు. ఎంబీసీలను కలుపుకుని పోతున్నామని, టికెట్లు కూడా ఇచ్చామని, ముందు కూడా ఇస్తమాన్నారు. అందరి హైదరాబాద్ ను కొందరి హైదరాబాద్ గా మార్చే ప్రయత్నాన్ని వ్యతిరేకిద్దామని పిలుపునిచ్చారు. 37 బీసీ సంఘాలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ కు మద్దతునివ్వడం శుభ పరిణామం అని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ భవన్ లో బీసీ సంఘాలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు, ఈటల రాజేందర్ సమావేశం అయ్యారు. బీసీలు, ఎంబీసీల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించిన ఏకైక సీఎం కేసిఆర్ అని ఈటల అన్నారు. అసెంబ్లీ ఆవరణలో మూడు రోజులు కొన్ని గంటల పాటూ బీసీ ల సమస్యల పై చర్చించి సీఎం కు నివేదిక ఇచ్చామని, దాన్ని ఆధారంగా నిర్ణయాలు జరుగుతున్నాయని తెలిపారు. 119 రెసిడెన్షియల్ స్కూళ్ల ను ఏర్పాటు చేసి అట్టడుగు వర్గాలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.

GHMC ELECTIONS LIVE NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *