అంపైర్ నిర్ణయంతో ఆశ్యర్యపోయాను

SURPRISE WITH 3RD UMPIRE

  • డీఆర్ఎస్ పద్ధతి సక్రమంగా లేదు
  • గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోవడం బాధ కలిగించింది
  • టీమిండియా సారథి విరాట్ కోహ్లి

ఆసీస్ బ్యాట్స్ మెన్ టర్నర్ ఔట్ అయినట్టు తేలినప్పటికీ, అంపైర్ ఔట్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించిందని టీమిండియా సారథి విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. డీఆర్ఎస్ సమీక్ష పద్ధతి సక్రమంగా లేదని, ప్రతిసారీ ఇది చర్చనీయాంశంగా మారిందని వ్యాఖ్యానించాడు. ఆసీస్‌తో మొహాలీలో జరిగిన నాలుగో వన్డేలో భారత్‌ భారీ స్కోర్‌ చేసినా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. డీఆర్ఎస్ సమీక్ష పద్ధతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాడు. ‘చాహల్‌ బౌలింగ్‌లో టర్నర్‌ బ్యాట్‌కు బంతి తగిలినట్లు రీప్లేలో కనిపించింది. అయినా అంపైర్‌ ఔటివ్వలేదు. దీంతో ఈ సమీక్ష పద్ధతి సరిగ్గా లేదు. అంపైర్‌ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది.  డీఆర్ఎస్‌ పద్ధతికి స్థిరత్వం లేదు. ప్రతిసారీ ఇది చర్చనీయాంశంగా మారుతోంది’ అని ఆవేదన చెందాడు.

గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి చెందడంతో చాలా బాధేస్తోందని పేర్కొన్నాడు. ‘వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా మంచు విషయం మా అంచనా తప్పింది. మంచు వల్ల చివర్లో మా బౌలర్లకు అసలు పట్టు చిక్కలేదు. అయితే దీనిని ఓటమికి సాకుగా చెప్పను. ఆఖరి ఓవర్లలో ఐదు అవకాశాలు వృథా కావడం జీర్ణించుకోలేనిది. స్టంపింగ్‌ అవకాశం చేజారింది. ఫీల్డింగ్‌ బాగా లేదు. అస్టన్‌ టర్నర్‌, ఖాజా హ్యాండ్స్ కోంబ్ అద్భుతంగా ఆడారు. వారు ఈ విజయానికి పూర్తి అర్హులు. రాంచీ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ఉంటే మొదట బ్యాటింగ్‌ చేసే వాళ్లం. కేదార్‌ జాదవ్‌, విజయ్‌శంకర్‌ మంచులో సైతం బంతితో రాణించి ఉంటే బాగుండేది. ఇకపై ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగుతాం. టర్నర్‌ కేవలం రెండో మ్యాచ్‌లోనే ఇలాంటి గొప్ప ఇన్నింగ్స్‌ ఆడటం ప్రశంసనీయం’ అని కోహ్లి పేర్కొన్నాడు.

SPORTS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *