ఏపీ గవర్నర్ గా సుష్మా స్వరాజ్

Spread the love

Sushma swaraj as governer

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయింది. అందుకు గాను ఏపీకి కొత్త గవర్నర్ ని ఏర్పాటు చేసే పనిలో ఉంది కేంద్రం. అయిది ఆ గవర్నర్ ఎవరో కాదు సుష్మా స్వరాజ్ అని ప్రచారం జరిగింది. అందుకుగాను బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ని ఎంపిక చేయనున్నారని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని స్వయంగా ఆమె ప్రకటించింది . కానీ సుష్మాస్వరాజ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. సుష్మాస్వరాజ్ తో పాటే మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ వీరిద్దరిని కూడా గవర్నర్లుగా పంపే ఆలోచనలు ఉన్నారు. ఈ విషయం మీద ఇప్పటికే సామజిక మాంద్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి తోడుగా సోషల్ మీడియా, తెలుగులోని కొన్ని ఛానల్స్ సైతం హోరెత్తించాయి. అయితే ఈ వార్తల్లో ఎలాని నిజం లేదని స్పష్టం చేసింది సుష్మాస్వరాజ్…

ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్ “ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని సంప్రదించింది నా ఏపీ గవర్నర్ నియామకం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాను. నన్ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమించనున్నారనే ప్రచారం నిజం కాదు“ అని రెండు ట్వీట్ల ద్వారా సుష్మాస్వరాజ్ క్లారిటీ ఇచ్చేశారు.ఇదిలాఉండగా, సుష్మాస్వరాజ్ గవర్నర్ నియామకంపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సైతం వార్తల్లో నిలిచారు…’ఏపీ గవర్నర్‌గా నియమితులైన సుష్మాస్వరాజ్‌కు శుభాకాంక్షలు’ అంటూ కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ ట్వీట్‌ చేశారు. అయితే.. కొద్దిసేపటికే ఆయన ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశారు. కాగా ఈ వివరాన్ని కూడా ఇంకా అధికారికంగా వెల్లడవ్వాల్సి ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *