సుష్మా స్వరాజ్ కన్నుమూత

SUSHMA SWARAJ NO MORE

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ (67) కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఎయిమ్స్ కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సుష్మాస్వరాజ్‌కు భర్త, కుమార్తె ఉన్నారు. ఇటీవలే ఆమె మూత్రపిండాల మార్పిడి చికిత్స చేయించుకున్నారు. అనారోగ్య కారణాలతో 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 1953 ఫిబ్రవరి 14న హర్యాణాలోని అంబాలలో జన్మించిన సుష్మా..  1970వ దశకంలో ఏబీవీపీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఏడుసార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1977లో 25 ఏళ్ల వయసులోనే హరియాణా మంత్రిగా పనిచేశారు.  మోదీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ఢిల్లీ సీఎంగా కూడా పని చేశారు. 2009 నుంచి 2014 వరకు 15వ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు. ఇక తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా చేయడంలో సుష్మ కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆమె.. బీజేపీ, దాని మిత్ర పక్షాలు బిల్లుకు అనుకూలంగా వ్యవహరించేలా కృషి చేశారు. తనను తెలంగాణ చిన్నమ్మగా అభివర్ణించుకున్నారు. కాగా, సుష్మా మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

NATIONAL NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *