సీఎం జగన్ ను ఎవరైనా విమర్శిస్తే తాట తీస్తా..  ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్

svbc chairmen prudhviraj about cm jagan
ఇటీవల  జగన్ సీఎం అయిన తర్వాత సినీ పరిశ్రమ వాళ్ళు ఎవరూ జగన్ ను కలవటానికి రాలేదని సంచలన ఆరోపణలు చేసిన పృద్వీ రాజ్ మరోమారు సంచలన ఆరోపణలు చేశారు . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ని  ఎవరైనా ఏదైనా అంటే  వాళ్ల తాట తీస్తానని  సినీనటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ అన్నారు. చిత్తూరు జిల్లా  చంద్రగిరిలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించి పంద్రాగస్టు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…  సినిమా ఇండస్ట్రీ వాళ్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలపమని చెప్పాను తప్ప..తానేమీ తప్పుగా మాట్లాడలేదన్నారు. కానీ తిరుమలలో రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వర్గవిభేదంగా ఉన్నాయని  పృథ్వీ ఆరోపించారు.చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సత్కారాలు చేస్తారు… జగన్ సీఎం అయితే విమర్శలు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎంతో మంది సినిమా వాళ్లు లబ్ధి పొందారని పృథ్వీ గుర్తు చేశారు. సీఎం జగన్ ను ఎవరైనా విమర్శిస్తే తాట తీస్తానని హెచ్చరించారు. పులి కడుపున పులే పుడుతుంది కానీ.. లోకేష్ పుట్టడని ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *