నాని… నోరు అదుపులో పెట్టుకో

Swami Paripurnanada Hard commets on Mla Nani

మంత్రి నాని చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జగన్‌కు వినిపిస్తున్నాయో? లేదో? తెలియదని, సీఎం స్పందించకపోతే ఆయనే మాట్లాడించారని అనుకోవాల్సి వస్తుందని స్వామి పరిపూర్ణానంద అన్నారు. తిరుమల దర్శనార్థం వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ‘డిక్లరేషన్’ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. హిందూ దేవాలయాల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.  జగన్ ప్రభుత్వానికి 150 సీట్లు వచ్చాయని, అందులో 149 స్థానాలు హిందువులు ఓట్లు వేస్తేనే వచ్చాయని ఆయన పేర్కొన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే… హిందువులు పెట్టుకున్న నమ్మకానికి సీఎం జగన్ పునాదులను కూడా పొడిచేస్తున్నారని అన్నారు. మంత్రి కొడాలి నానికి ఏమాత్రం చరిత్ర తెలియదని, ఓసారి చరిత్రను తిరిగేయాలని స్వామీజీ అన్నారు.

నాని గతంలో ఓ పార్టీలో ఉండేవారని, ప్రస్తుతం మరో పార్టీలో ఉన్నారని, త్వరలో కొడాలి నానికి ఈ పార్టీపై ఉన్న భ్రమలు కూడా తొలిగిపోయి, ఇతర పార్టీలోకి వెళ్తారని ఎద్దేవా చేశారు. దేవుళ్ల గురించి మాట్లాడే స్థాయి నానికి లేదని మండిపడ్డారు. తిరుమల కొండతో పెట్టుకున్న వారి బూడిద కూడ దొరకలేదని, ఆ చరిత్ర కూడా కళ్లముందే ఉందని పేర్కొన్నారు. దేవుళ్లతో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా పోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *