స్విట్జర్లాండ్లో సద్దుల బతుకమ్మ సంబరాలు

Spread the love

Switzerland Bathukamma Celebrations

తెలంగాణ జాగృతి స్విట్జర్లాండ్ ఆధ్వర్యంలో మహా బతుకమ్మ వేడుకలు, జురిచ్ నగరం లో ఘనంగా నిర్వహించారు. మహిళలు పిల్లలు ఉత్సాహంగా పాలుగొని బతుకమ్మ, కోలాటం ఆడారు. కార్యక్రమంలో గాయని స్వాతి రెడ్డి పాటలు ప్రతేయక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఉత్సవాలలో స్విట్జర్లాండ్ ప్రభుత్వ స్థానిక ప్రతినిధులు శ్రీ బార్బరా జిక మరియు మథియాస్ జిక కూడా పాల్గొని ఉత్సాహంగా బతుకమ్మ పాటలు పాడి ఆనందించారు. మాతృభూమికి దూరంగా ఉన్నా.. సంస్కృతి సంప్రదాయాలను పాటించడం గురించి వారు ఈ సందర్భంగా అభినందించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షులు కిషోర్ తాటికొండ మరియు జనరల్ సెక్రటరీ అనిల్ జాలల, తెలంగాణ రాష్ట్ర సమితి స్విట్జర్లాండ్ అధ్యక్ష ఉపాధ్యక్షులు శ్రీధర్ గందే అల్లు కృష్ణ రెడ్డి, పవన్ దుద్దిళ్ల, యువరాజ్ రాచకొండ, పద్మజ రెడ్డి తదితరులు కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసారు.

Bathukamma Celebrations WorldWide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *