బాహుబలి-1 రికార్డు బ్రేక్

SYERAA BREAKS BAHUBALI RECORD

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా రికార్డులు కొల్లగొడుతోంది. గాంధీజయంతి రోజున విడుదలైన ఈ మూవీ.. దసరా సందర్భంగా దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటివారం వసూళ్లలో బాహుబలి-1ని వెనక్కి నెట్టింది. ప్రపంచవ్యాప్తంగా తొలివారం షేర్ లో బాహుబలి-2 197.07 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. బాహుబలి-1వ భాగం రూ.101.67 కోట్లతో రెండో స్థానంలో ఉండేది. అయితే సైరా ప్రస్తుతం రెండో స్థానానికి వచ్చింది. ఈ సినిమాకి తొలివారం ప్రపంచవ్యాప్తంగా రూ.116.23 కోట్ల షేర్ వసూలైంది. దీంతో ఇప్పటివరకు బాహుబలి-1 పేరిటి ఉన్న రికార్డును సైరా అధిగమించినట్టయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా షేర్ ఇప్పటికి రూ.84 కోట్లు దాటడం విశేషం.

TELUGU CINEMA

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *