సాహో ఎఫెక్ట్.. తగ్గిన ’సైరా’ నిడివి

SYERAA MOVIE LENGTH REDUCED

సాహో ఫలితం సైరాకు పనికొచ్చింది. భారీ బడ్జెట్ తో, ఎన్నో అంచనాలతో విడుదలైన సాహో సినిమా ప్రేక్షకాదరణ చూరగొనలేకపోయిన సంగతి తెలిసిందే. కలెక్షన్ల విషయంలో రికార్డులు వచ్చినా.. సినిమా మాత్రం తేడా కొట్టేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో సైరా యూనిట్ అప్రమత్తమైంది. సాహో విషయంలో జరిగిన తప్పులు తాము చేయకూడదని భావిస్తోంది. ముఖ్యంగా సినిమా నిడివి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. సాహో సినిమాకు నిడివి కూడా ప్రతికూలంగా మారింది. 172 నిమిషాల రన్ టైమ్ ఆ సినిమాకు ఓ మైనస్ గా మారింది.

దీంతో సైరాకు అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదని ఆ యూనిట్ యోచిస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంలో గట్టిగానే ఉన్నట్టు టాక్. సినిమా నిడివి ఎట్టి పరిస్థితుల్లోనూ 2 గంటల 40 నిమిషాలకు మించొద్దని స్పష్టంచేసినట్టు తెలిసింది. అంతకంటే తక్కువ ఉన్నా పర్లేదని, కానీ అంతకు మించి మాత్రం ఉండటానికి వీల్లేదని పేర్కొన్నట్టు సమాచారం. దీంతో దర్శకుడు ఆ మేరకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మరో మెగాస్టార్ అమితాబ్ కీలక పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా సినిమాపై అందరిలోనూ భారీగానే అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

TELUGU CINEMA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *