సైరా.. ఓవర్సీస్ లో ఔరా

SYREE OVERSEAS RIGHTS

మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహ రెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న విడుదల కానుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరిలోనూ గట్టి అంచనాలే నెలకొన్నాయి. విడుదలకు ముందే టీజర్, పోస్టర్లతో ఆకట్టుకున్న ఈ సినిమా బిజినెస్ సైతం భారీగా సాగుతోంది. ఓవర్సీస్ లో ఔరా అనిపించే రీతిలో రేటు పలికినట్టు తెలుస్తోంది. ఓవర్సీస్ హక్కుల కోసం ఫార్స్ ఫిలిమ్స్ అనే సంస్థ రూ.18 కోట్లు ఆఫర్ చేసినట్టు సమాచారం. ఓవర్సీస్ లో ఇది పెద్ద మొత్తం కిందే లెక్క. ఇక డిజిటల్ హక్కుల కోసం కూడా గట్టి పోటీనే నెలకొంది. డిజిటల్, ఆన్ లైన్ స్ట్రీమింగ్ కోసం రూ.40 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇక నైజాం ఏరియాకు రూ.40 కోట్లు ఇస్తామని ముందుకు వస్తున్నారని సమాచారం. ఇవన్నీ చూస్తుంటే విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ ఖాయమని అంటున్నారు.

TELUGU CINEME

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *