టీ వర్క్స్ కొత్త వెంటిలేటర్

T-WORKS NEW VENTILATOR

T-WORKS NEW VENTILATOR

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక మంది రకరకాల వెంటిలేటర్లు తయారు చేశామంటూ ముందుకు వస్తున్న తరుణంలో టీ వర్క్స్, దేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్ సంస్థలతో కలిసి తక్కువ ఖర్చు తో ఒక పూర్తి స్థాయి వెంటిలేటర్ను తీసుకొచ్చింది. ఇందుకోసం టీ వర్క్స్ టీమ్ తో పాటు క్వాల్కమ్, honeywell , జి ఈ వంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ఆ సంస్థల ఇంజనీర్లతో కలిసి తయారుచేసిన వెంటిలేటర్ను మంత్రి కేటీఆర్ పరిశీలించారు.

వెంటిలేటర్ తయారీలో అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యంతో టీ వర్క్స్ దాదాపు 20 మంది యువ నిపుణులతో కలిసి 30 రోజుల పాటు కష్టపడి ఈ వెంటిలేటర్ ని తయారు చేసింది. ఇందుకోసం అనేక ప్రోటోటైప్ పరికరాలను ఉపయోగించి, పలుమార్లు వాటిని పరిశీలించి ప్రస్తుత నమూనాను తయారు చేయగలిగారు, ఇందుకోసం నిమ్స్ వైద్యుల అవసరాలు ,సలహాలు, సూచనల మేరకు ఈ వెంటిలేటర్ ని రూపొందించారు. ఈ వెంటిలేటర్ దాదాపు 35 వేల రూపాయల ఖర్చు లో అందుబాటులోకి వస్తుంది, దీని ద్వారా తక్షణమే అవసరమైతే రోగులకు సేవలు అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నది. రానున్న రోజుల్లో ఈ వెంటిలేటర్ ని మరింత చౌకగా, మరిన్ని అత్యుత్తమ సౌకర్యాలతో రూపొందించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ఈ వెంటిలేటర్ తయారీ పైన కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు ఆసక్తి చూపిస్తున్నారని సుజయ్ మంత్రికి వివరించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఈ వెంటిలేటర్ తో రోగికి అవసరమైన సేవలు అందించేందుకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలు తాము ఈ వెంటిలేటర్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.

ప్రస్తుత ఆపత్కాలంలో ప్రముఖ సంస్థలతో కలిసి ఇంత తక్కువ కాలంలో తక్కువ రేటు తో అత్యుత్తమ సౌకర్యాలతో కూడిన ఒక పూర్తిస్థాయి వెంటిలేటర్ ని తయారు చేయడం పట్ల మంత్రి కేటీఆర్ టీ వర్క్స్ ను అభినందించారు. ఇందులో పాలుపంచుకున్న సభ్యులను, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులను, ఇంజనీరింగ్ మరియు మెకానికల్ నిపుణులను మంత్రి కేటీఆర్ అభినందించారు. #TWORKS,#KTRTRS

 

T-WORKS NEW VENTILATOR

Related posts:

రైల్వే స్టేషన్ లో ఉచిత వైఫై బంద్
దేశవ్యాప్తంగా ఫ్రీ వైఫై సేవలు నిలిపివేత
10 వేల కోట్లను చెల్లించిన ఎయిర్ టెల్
5జీ  చీపెస్ట్  ఫోన్లు...జియో సంచలనం
 రిపబ్లిక్ డే సేల్స్ ..ఆఫర్లతో అమెజాన్,ఫ్లిప్ కార్ట్
నిరుద్యోగులకు పండుగ లాంటి వార్త చెప్పిన అమెజాన్
విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీపట్టిన నాసా
విక్రమ్ పై ఆశలు అడియాశలేనా?
ఇంటింటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్
ఎకో ల్యాబ్ ను ఆవిష్క‌రించిన డ్రూమ్
కూల్ ప్యాడ్ కూల్ 3 ప్లస్
ఈ లాప్ టాప్ ను మడతపెట్టేయొచ్చు
కాంగ్రెస్ లో చేరిన బాలీవుడ్ తార ఊర్మిళ
కోట్లాది యూజర్ల పాస్ వర్డ్స్ టెక్స్ట్ రూపంలో దాచిన ఫేస్ బుక్
ఎన్టీఆర్‌..బిగ్ బాస్ 3 చేయ‌డం లేదు.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *